నందమూరి తారకరత్న గత ఏడాది ఫిబ్రవరిలో హార్ట్ ఎటాక్ తో బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. తారకరత్న ఆసుపత్రిలో జాయిన్ అప్పటినుంచి ఆయన బాబాయ్ బాలకృష్ణ, అలేఖ్య బాబాయ్ విజయ్ సాయి రెడ్డిలు దగ్గరుండి చూసుకున్నారు. తారకరత్న మరణం తర్వాత అలేఖ్య ఆయన పిల్లల బాధ్యతను బాలయ్య అలాగే అలేఖ్య, విజయ సాయి రెడ్డి లు చూసుకుంటున్నారు.
అలేఖ్య భర్త జ్ఞాపకాలతో గత ఏడాదిన్నర కాలంగా సతమతమవుతోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తారకరత్న ఫోటోలు, వీడియోలు, పోస్టులను పెడుతూ ఎమోషనల్ అవుతుంది. తారకరత్న మరణం తర్వాత ఆయన కుటుంబంలో తొలి శుభకార్యం జరిగింది. తారకరత్న పెద్ద కుమార్తె నిష్క కు హాఫ్ శారీ ఫంక్షన్ హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించారు.
అయితే ఈ వేడుకలో సీఎం చంద్రబాబు, అలాగే ఎన్టీఆర్ ఫ్యామిలీస్ కనిపించలేదు. ఇక కూతురు నివిష్క ను అలేఖ్య అందంగా ముస్తాబు చేసి సాంప్రదాయబద్ధంగా నగలు వేసి అంగరంగ వైభవంగా హాఫ్ శారీ ఫంక్షన్ నిర్వహించింది. హాఫ్ సారీ లో నివిష్క కుందనపు బొమ్మగా ఉంది, అలేఖ్య ఇద్దరు కొడుకులు కుమార్తె తో కలిసి భర్త తారకరత్న చిత్రపటం దగ్గర దిగిన ఫొటోస్ వైరల్ గా మారాయి.