హీరో శ్రీవిష్ణు సామజవరాగమన తో సూపర్ హిట్ కొట్టాక రాజ రాజ చోరా డైరెక్టర్ తో శ్వాగ్ అంటూ ఎక్స్ పెరిమెంట్ మూవీ చేసాడు. హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కిన శ్వాగ్ చిత్రం లో శ్రీవిష్ణు నటనకు ప్రేక్షకులు ముగ్దులైనా.. చిత్రంలో కంటెంట్ కనిపించకపోవడంతో ఆడియన్స్ లైక్ చెయ్యలేదు.
శ్రీవిష్ణు మాత్రం డిఫరెంట్ గెటప్స్ డిఫరెంట్ వేరియేషన్ లతో తన నట విశ్వరూపంతో అదరగొట్టినప్పటికీ.. శ్వాగ్ చిత్రానికి ప్రేక్షకులు నెగెటివ్ రెస్పాన్స్ ఇవ్వడంతో ఈ చిత్రం థియేటర్స్ లో నిరాశపరిచే కలెక్షన్స్ తో నిర్మాతలకు నష్టాలను తెచ్చిపెట్టింది. ఈ చిత్రానికి ఓటీటీ పార్ట్నర్ ని విడుదలకు ముందే ఫిక్స్ చేసారు మేకర్స్.
మంచి డీల్ తో అమెజాన్ ప్రైమ్ శ్వాగ్ ఓటీటీ రైట్స్ దక్కించుకొన్నప్పటికీ ఈ చిత్రాన్ని మూడు వారాలు తిరక్కుండానే ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సైలెంట్ గా ఓటీటీలోకి స్ట్రీమింగ్ లోకి తెచ్చేసింది. గత అర్ధరాత్రి నుంచి శ్వాగ్ ఎలాంటి హడావిడి లేకుండా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చేసింది.