Advertisement
Google Ads BL

దేవర దుబాయ్-పుష్ప అమెరికా


దేవర దుబాయ్-పుష్ప అమెరికా అంటే ఏమిటో అనుకుంటున్నారేమో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో సెప్టెంబర్ 27 న రిలీజ్ అయిన దేవర చిత్రం నెగెటివ్ టాక్ తోనే సూపర్ హిట్ కలెక్షన్స్ సాధించడంతో ఆ సినిమాని పంపిణి చేసిన డిస్ట్రిబ్యూటర్స్ కి నిర్మాతలు దుబాయ్ వేదికగా అదిరిపోయే పార్టీ ఇవ్వడం మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. 

Advertisement
CJ Advs

నిర్మాత నాగవంశీ దేవర బయ్యర్లకు దుబాయ్ వేదికగా ట్రీట్ ఇవ్వడంతో.. పుష్ప ద రూల్ కుడా హిట్ అయితే వాళ్లకు అమెరికాలో పార్టీ ఇస్తారా అంటూ ఓ జర్నలిస్ట్ పుష్ప 2 నిర్మాతలను ప్రశ్నించారు. దానికి అదేముందండి.. సినిమా హిట్ అవుతుంది, అమెరికా కి మా డిస్ట్రిబ్యూటర్స్ ని పార్టీకి తీసుకెళ్లడం పెద్ద విషయం కాదు అన్నారు. 

ప్రస్తుతం భీభత్సమైన అంచనాలున్న పుష్ప ద రూల్ డిసెంబర్ 5 కి ప్రీ పోన్ అయ్యింది, ఇప్పటికే భారీ అంచనాలున్న పుష్ప 2 బ్లాక్ బస్టర్ అవడం ఖాయం, అమెరికాకు పార్టీకి వెళ్ళడానికి పాస్ పోర్ట్ లు రెడీ చేసుకోండి అంటూ డిస్ట్రిబ్యూటర్స్ ను అల్లు ఫ్యాన్స్ ఇప్పటి నుంచే అలెర్ట్ చేసేస్తున్నారు. 

 

Devara Dubai-Floral America:

Pushpa 2 success celebrations in America
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs