Advertisement
Google Ads BL

కంగువ ఈవెంట్‌లో సూర్య కంటతడి


నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైన కంగువ చిత్ర ప్రమోషన్స్ యమా జోరుగా సాగుతున్నాయి. హీరో సూర్య, దర్శకుడు శివ, దిశా పటానీ, బాబీ డియోల్ వంటి వారంతా చిత్ర ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. నిన్నటి వరకు ముంబైలో జరిగిన ఈ చిత్ర ప్రమోషన్స్ గురువారం హైదరాబాద్‌కు చేరుకున్నాయి. హైదరాబాద్ కంగువ చిత్ర మీడియా సమావేశంగా గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో ప్రేక్షకుల ప్రేమను చూసి హీరో సూర్య కంటతడి పెట్టుకున్నారు.

Advertisement
CJ Advs

అభిమానులను ఉద్దేవిస్తూ సూర్య మాట్లాడుతూ.. నా రక్తం మీ రక్తం వేరు కాదు.. మనమంతా ఒక్కటే. నాపై మీరు చూపిస్తున్న ప్రేమకు కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. నా నుండి సినిమా వచ్చి సుమారు రెండేళ్లు అవుతుంది. అయినా కూడా ఈ మధ్య సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా రీ రిలీజ్ విషయంలో మీరు చూపించిన స్పందనతో ఎంతో భావోద్వేగానికి గురయ్యాను. నాపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతగా మీకు గొప్ప సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇవ్వాలనే ఈ కంగువ మూవీ చేశాను. అందుకే రెండున్నరేళ్ల టైమ్ తీసుకుని మీరు ఇప్పటిదాకా స్క్రీన్ మీద చూడని ఒక అరుదైన చిత్రాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాం. దర్శకుడు శివ వల్లే ఇది సాధ్యమైంది.

ఇలాంటి సినిమాలు చేసేందుకు దర్శకుడు రాజమౌళిగారు ఎంతో స్ఫూర్తినిచ్చారు. ఆయన తన చిత్రాలతో మాకు దారి చూపించారు. కంగువ స్ట్రైట్ తెలుగు సినిమా.. ఇది ఇండియన్ సినిమా. ఇది ఒక పైటర్ సినిమా కాదు ఒక వారియర్ మూవీ. తన వాళ్ల కోసం, తను నమ్మిన ధర్మం కోసం పోరాడే వారియర్ సినిమా ఇది. నా లైఫ్‌లో మీరు (అభిమానులు) నా వారియర్స్. నా అభిమానులైన మీరు మీ జీవితాల్లో ఒక వారియర్‌లా పోరాడి అనుకున్నది సాధించాలి, గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. బాలకృష్ణగారి అన్ స్టాపబుల్ షోలో పాల్గొనడం మర్చిపోలేని ఎక్సిపీరియన్స్‌ని ఇచ్చింది. ఆయన సమయపాలన, హార్డ్ వర్క్, ప్యాషన్ చూశాక అందుకే అంత గొప్ప స్థాయికి వెళ్లారనిపించింది. నటుడిగా కమల్ హాసన్‌గారిని చూసి ఇన్స్‌పైర్ అవుతుంటా. మంచి సినిమాలు సమాజంలో ఎంతో మార్పు తీసుకొస్తాయి. అందులో నా సినిమాలు ఉండటం చాలా సంతోషాన్నిస్తుందని సూర్య చెప్పుకొచ్చారు. కాగా, స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నారు.

Hero Suriya Emotional at Kanguva Hyderabad Event:

Hero Suriya About Kanguva Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs