Advertisement
Google Ads BL

పుష్ప 2 న్యూ రిలీజ్ డేట్ పోస్టర్


పుష్ప 2 ది రూల్ రిలీజ్ డేట్ మారింది. ముందు చెప్పిన డేట్ కంటే ఒక రోజు ముందుగానే థియేటర్లలోకి రానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు న్యూ రిలీజ్ డేట్ పోస్టర్‌ని కూడా నిర్మాతలు విడుదల చేశారు. గురువారం హైదరాబాద్‌లో పుష్ప 2 మూవీ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చిత్ర నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పుష్ప 2 చిత్రం డిసెంబర్ 5న ఆరు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు. యుఎస్ ప్రేక్షకులకు ఇంకా ముందుగానే ప్రీమియర్స్ ఉంటాయని నిర్మాత నవీన్ యెర్నేని తెలిపారు. 

Advertisement
CJ Advs

పుష్ప 2 కోసం బన్నీ పడిన కష్టాన్ని మాటల్లో చెప్పలేను. మరో నేషనల్‌ అవార్డు వస్తుందని ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాం. అవార్డు అని కాదు కానీ నటనలో బెస్ట్‌ ఇవ్వడానికి అల్లు అర్జున్‌ ఎంతో కష్టపడ్డారు. రెండోసారి కూడా నేషనల్‌ అవార్డు తీసుకోవడానికి ఆయన అర్హుడు అని భావిస్తున్నాం. ఇప్పటి వరకు నాన్‌ థియేట్రికల్‌గా రూ. 420 కోట్లు బిజినెస్‌ చేశాం. ఒక రోజు ముందు విడుదల చేయడానికి కారణం లాంగ్‌ వీకెండ్‌ కోసమే. ఓవర్సీస్‌లో డిసెంబర్ 4 నుండే షోస్‌ ఉంటాయి.. పుష్ప 1ని మించి పుష్ప 2 హిట్‌ అవుతుందని నిర్మాత నవీన్ చెప్పుకొచ్చారు.

అంతేకాదు, పుష్ప 3కి కూడా పుష్ప 2లో లీడ్ ఉంటుందని మరో నిర్మాత రవి ప్రకటించారు. ఈ సినిమాలో జాతర ఎపిసోడ్ చాలా గొప్పగా ఉంటుందని, దానికోసం చాలా కష్టపడ్డామని తెలిపారు. ఐటం సాంగ్ విషయమై త్వరలోనే క్లారిటీ ఇస్తామన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Pushpa 2 The Rule New Release Date Poster Out:

Producers About Pushpa 2 Release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs