Advertisement
Google Ads BL

గంగవ్వ పెర్ఫార్మెన్స్ పీక్స్ అసలు


బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 షో రోజురోజుకూ దారుణంగా పడిపోతుంది. హౌస్‌లో అంతమంది యువతీయువకులు ఉన్నప్పటికీ.. బిగ్ బాస్ గంగవ్వ మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే.. ఈ షో ఎంతగా డౌన్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. మణికంఠ నస వదిలిందనుకుంటే.. విష్ణుప్రియ, నయని అంతకంటే ఎక్కువగా చిరాకు తెప్పిస్తున్నారు. మరీ ముఖ్యంగా నయని ఏడుపు స్టార్‌గా మారిపోయింది. ప్రతి చిన్న విషయానికి ఆమె ఏడుస్తుంటే.. ఎప్పుడెప్పుడు ఆమెని బయటికి పంపిస్తారా? అని షో చూస్తున్న వారంతా అనుకుంటున్నారు. 

Advertisement
CJ Advs

ఇక గంగవ్వ మాత్రం దెయ్యం పట్టినట్లుగా యాక్ట్ చేసిన తీరు పీక్స్ అనే చెప్పాలి. ఆమె జుట్టు విరబోసుకుని, హౌస్ బయటికి వచ్చి వేసిన వీరంగం, ఇంట్లో దుప్పట్లో వేసిన కేకలు అన్నీ కూడా గంగవ్వ పెర్ఫార్మెన్స్ పీక్స్ అనేలా చూస్తున్న వారికి, హౌస్‌లోని వారికి అనిపించిందంటే.. ఎంతగా ఆమె రెచ్చిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా లాన్‌లో కూర్చున్నప్పుడు ఒక్కో కంటెస్టెంట్ దగ్గరకి వస్తున్నప్పుడు గంగవ్వ రియాక్ట్ అయిన తీరు.. వావ్ అనాల్సిందే. 

ఇక గంగవ్వ ప్రవర్తనపై ఒక్కో కంటెస్టెంట్ ఒక్కో రకంగా ఊహించుకోవడం కూడా కాస్త ఇంట్రస్ట్‌ని కలిగించింది. సైకలాజికల్‌గా గంగవ్వ డిస్టర్బ్ అయిందంటూ ఇంటి సభ్యులంతా మాట్లాడుకునేలా గంగవ్వ ఘోస్ట్‌ ప్రాంక్‌తో రక్తికట్టించింది. అయితే ఇదంతా చూసిన వాళ్లు మాత్రం యంగ్ బ్యాచ్‌ని పక్కన పెట్టేసి.. గంగవ్వతో బిగ్ బాస్ షో నడపాలని యాజమాన్యం భావిస్తున్నారని అనుకుంటూ ఉండటం విశేషం. అయితే కొంతమంది మాత్రం అలా ఎందుకు అనుకోవాలి. ఆమె కూడా ఒక కంటెస్టెంటే కదా.. ఆమె చేసేది చేయాలిగా అంటూ బిగ్ బాస్‌కి సపోర్ట్ చేస్తున్నారు.

Bigg Boss 8 Telugu Gangavva Ghost Prank Video Goes Viral:

Bigg Boss Hopes on Gangavva
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs