Advertisement
Google Ads BL

ఐ వాంట్ టు టాక్: అభిషేక్ బచ్చన్


అభిషేక్ బచ్చన్ మాట్లాడాలనుకుంటున్నాడట.. దేని గురించి? సడెన్‌గా నేను మాట్లాడాలనుకుంటున్నానంటే.. అంతా ఏదో అనుకుంటారు కదా. అసలే ఈ మధ్య బిగ్ బి ఫ్యామిలీపై రకరకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా అభిషేక్, ఐశ్వర్యరాయ్ ఇద్దరూ విడిపోయారని, వేరువేరుగా ఉంటున్నారనేలా ఒకటే వార్తలు. ఆ వార్తలలో కొంత నిజం ఉందనేలా.. ఈ మధ్య వారు అటెంట్ అయిన వేడుకలలో ప్రవర్తించిన తీరు కూడా వారి వైవాహిక బంధంపై మాట్లాడుకునేలా చేస్తోంది. అయితే మేము కలిసే ఉన్నాం.. ప్రతిసారి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ అభిషేర్ ఆ మధ్య ఫైర్ అయ్యాడు కూడా. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నేను మాట్లాడాలని అనుకుంటున్నానంటూ అభిషేక్ అంటే.. ఏదో మ్యాటర్ ఉందనే కదా అంతా అనుకుంటారు. 

Advertisement
CJ Advs

అయితే ఇది తన పర్సనల్ జీవితానికి సంబంధించినదో, రియల్ లైఫ్‌కి సంబంధించినదో అయితే కాదు.. రీల్ లైఫ్‌కి సంబంధించిన మ్యాటర్. అభిషేక్ బచ్చన్ హీరోగా నటిస్తోన్న చిత్రం ఐ వాంట్ టు టాక్. సుజిత్ సర్కార్ దర్శకుడు. ఈ సినిమాను అనౌన్స్ చేస్తూ.. మేకర్స్ టీజర్‌ను వదిలారు. ఈ టీజర్‌లో అభిషేక్ బచ్చన్ వాయిస్‌తో టాకింగ్ గురించి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. 

నేను మాములుగా మాట్లాడటానికి ఇష్టపడను.. కానీ మాట్లాడటానికే బతికి ఉన్నానేమో. ఈ భూమి మీద బతికి ఉన్నవారికి, చనిపోయిన వారికి తేడా ఇదే. బతికున్నవారు మాట్లాడతారు, చనిపోయిన వారు మాట్లాడలేరు. మాట్లాడటానికే బతికున్న వ్యక్తి.. జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని.. అవకాశాలను వెతుక్కుంటూ ముందుకు వెళుతుంటాడు.. అంటూ ఈ టీజర్‌లో చెప్పుకొచ్చారు. ఈ సినిమా నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Abhishek Bachchan Says I Want to Talk:

Abhishek Bachchan Unveils I Want to Talk Teaser
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs