Advertisement
Google Ads BL

స్వీటీ అనుష్క.. సడెన్‌గా ఈ షాకేంటి?


స్వీటీ అనుష్క, షాక్ అనగానే ఆమె ఏమైనా పెళ్లి చేసేసుకుందని అనుకుంటారేమో. అలాంటి షాకింగ్ వార్త అయితే ఇది కాదు. ఎందుకలా అంటే, ఈ మధ్య అనుష్క పెళ్లికి సంబంధించి వార్తలు అలా వైరల్ అవుతున్నాయి మరి. ఒకసారి ప్రభాస్‌తో పెళ్లి అంటూ వార్తలు వస్తాయి. ఇంకోసారి ఫారిన్‌లో ఉన్న పారిశ్రామికవేత్తని అనుష్క పెళ్లాడబోతోందంటూ ఒకటే వార్తలు. ఇలాంటి వార్తలన్నింటినీ ఆమె ఖండిస్తూ ఉండటం కూడా కామనే. సరే, ఇక విషయంలోకి వస్తే.. 

Advertisement
CJ Advs

అనుష్క నుండి సినిమా వచ్చి చాలా కాలం అవుతుంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత ఆమె ఏం సినిమా చేస్తుందో క్లారిటీ లేదు. క్రిష్‌తో ఘాటి అనే సినిమా చేస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి కానీ.. అధికారిక ప్రకటన అయితే లేదు. కానీ ఇప్పుడు ఒకటి కాదు.. అనుష్క రెండు సినిమాలు పూర్తి చేసిందనేలా సడెన్‌గా షాకింగ్ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ వార్తతో అనుష్క ఫ్యాన్స్ మాత్రం పిచ్చ హ్యాపీగా ఉన్నారు. 

ఇక అనుష్క పూర్తి చేసినట్లుగా వినిపిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. మలయాళంలో కథనార్ అనే మూవీతో పాటు క్రిష్ దర్శకత్వంలో ఘాటి అనే చిత్రాలను అనుష్క పూర్తి చేసిందట. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానున్నాయని తెలుస్తుంది. ఏదయితేనేం ఆఫ్టర్ లాంగ్ టైమ్.. అనుష్క సినిమాలకు సంబంధించి ఇలాంటి వార్త రావడం ప్రేక్షకులకు కూడా సంతోషాన్నిచ్చేదే అని చెప్పుకోవచ్చు. మరి ఈ సినిమాలపై అధికారిక ప్రకటనే రావాల్సి ఉంది.

Anushka Completes 2 Films Silently:

Anushka Shetty Wraps Up Shooting For Kathanar And Ghaati
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs