Advertisement
Google Ads BL

అందుకే గ్లామర్ రోల్స్ చేయట్లేదు!


ఎప్పుడు సాయిపల్లవి గురించి వార్తలు వచ్చినా.. మెయిన్ మాట్లాడుకునేది ఆమె నిండైన దుస్తుల్లో మాత్రమే కనిపిస్తుందని, గ్లామర్ పరంగా హద్దులు పెట్టుకుందనే ఎక్కువగా వినబడుతుంటుంది. సాయిపల్లవి కూడా గ్లామర్ పాత్రలైతే చేయనని దర్శకనిర్మాతలకు ఖరాఖండీగా చెప్పేస్తానని చాలా సార్లు చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. అందుకే తనకు చాలా సినిమా అవకాశాలు పోయాయని, అయినా కూడా ఎప్పుడూ బాధపడలేదని సాయిపల్లవి చెప్పింది. 

Advertisement
CJ Advs

గ్లామర్ పాత్రలు చేయనని చెప్పింది కానీ.. ఎప్పుడూ కూడా ఎందుకు తను గ్లామర్ పాత్రలు చేయకూడదని అనుకుందో మాత్రం ఎక్కడా రివీల్ చేయలేదు. తాజాగా ఆమె నటించిన అమరన్ ప్రమోషన్స్‌లో భాగంగా సాయిపల్లవి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో అసలు విషయం చెప్పేసింది. అసలెందుకు తను గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండాల్సి వచ్చిందో సాయిపల్లవి ఈ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చింది.

నేను సినిమాలలోకి రాకముందు ఎడ్యుకేషన్ నిమిత్తం జార్జియా వెళ్లాను. అక్కడ ఎంతో ఫేమస్ అయిన టాంగో డ్యాన్స్‌ నేర్చుకున్నా. ఆ డ్యాన్స్‌ చేయడానికి ప్రత్యేకంగా ఒక కాస్ట్యూమ్‌ ఉంటుంది. ఆ కాస్ట్యూమ్‌లో సౌకర్యంగా ఫీలయ్యాకే ఆ డ్యాన్స్‌లో శిక్షణ పొందాను. ఒక స్టేజ్ మీద ఆ డ్యాన్స్ కూడా చేశాను. ఆ తర్వాత కొంతకాలానికి ప్రేమమ్‌ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమా టైమ్‌లో నా టాంగో డ్యాన్స్‌ వీడియోను కొందరు నెటిజన్లు షేర్ చేసి చాలా నెగిటివ్‌గా కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ నన్ను ఎంతగానో బాధపెట్టాయి. ఆ రోజు ఇకపై సినిమాల్లో శరీరం కనిపించేలా దుస్తులు వేయకూడదని నిర్ణయించుకున్నాను. అదే ఇప్పుడు ఒక నియమంలా మారిపోయిందని సాయిపల్లవి చెప్పుకొచ్చింది. అది అసలు విషయం.

Sai Pallavi Clarity About Glamour Roles:

Sai Pallavi Reveals Why She Didnot Played Glamour Roles
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs