Advertisement
Google Ads BL

డౌన్ ఫాల్.. ఆ హీరోకి ఓకే చెప్పిన అను


అను ఇమ్మాన్యుయేల్.. ఈ పేరు గుర్తుందా? ఫిగర్ కత్తిలా ఉంటుంది కానీ ఏం లాభం.. అవకాశాలే లేకుండా పోయాయ్. కెరీర్ ప్రారంభంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన నటించిన ఈ భామ.. ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్న శివ కందుకూరి వంటి హీరోతో చేయడానికి ఓకే చెప్పింది అంటే.. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందానికి అందం, నటిగా కూడా పాస్ మార్కులు వేయించుకుంది.. అయినా కూడా ఆమెకు అవకాశాలు రాలేదంటే... ప్రాబ్లమ్ ఎక్కడ ఉండి ఉంటుందో ఆమెకే తెలియాలి.

Advertisement
CJ Advs

ఇక చాలా గ్యాప్ తర్వాత అను ఇమ్మాన్యుయేల్ నటించే సినిమా అప్డేట్ వచ్చింది. బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్ మరియు My3 ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న చిత్రంలో శివ కందుకూరి సరసన అను ఇమ్మాన్యుయేల్ నటించబోతోంది. ఈ సినిమాను అధికారికంగా బుధవారం అనౌన్స్ చేశారు. ఈ మూవీ విశేషం ఏమిటంటే.. ఇప్పటి వరకు ఐదు భాషలలో 34 చిత్రాలకు డీవోపీగా పనిచేసిన సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు ఓ లీడ్ రోల్‌లో నటిస్తుండటం.

ఈ మూవీ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్‌గా ఉండబోతోందని, ప్రస్తుతం లండన్‌లోని అందమైన ప్రదేశాలలో చిత్రీకరణ జరుగుతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. త్వరలోనే ఈ చిత్ర టైటిల్‌ని విడుదల చేయనున్నారు. అయితే, ఎప్పుడైతే ఈ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చిందో.. ఇందులో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ అని తెలిసిందో.. అంతా డౌన్ ఫాల్ అంటే ఇదేనంటూ అనుని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తుండటం విశేషం. అయితే ఇందులో తప్పేం లేదు.. కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉంటే అనుష్క వంటివారే చిన్న చిన్న చిత్రాలలో చేస్తున్నారు. ఇక అను ఇమ్మాన్యుయేల్ చేయడంలో తప్పేముంది అంటూ.. ఆమె అభిమానులు అనుకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

Anu Emmanuel Heroine in Shiva Kandukuri Film:

Anu Emmanuel New Movie Announced
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs