మెగాస్టార్ చిరంజీవి నుంచి రెబల్ స్టార్ ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వచ్చేశాయ్. మెగాస్టార్ చిరంజీవి అంటే తనకు ఎంత ఇష్టమో ప్రభాస్ పలు సందర్భాలలో వ్యక్తం చేశారు. రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి సినిమాలలోని బోలో బోలో బోలో రాణి పాట తనకు ఎంతో ఇష్టమని ప్రభాస్ చెబుతున్న వీడియో ఒకటి బాగా వైరలైంది. అంత అభిమానం చిరు అంటే. చిరంజీవికి కూడా ప్రభాస్ అంటే అంతే ఇష్టం. ఆయన కూడా ఆ ఇష్టాన్ని పలు సందర్భాలలో తెలిపి ఉన్నారు. ఇక ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.. తెలియజేస్తున్నారు. ప్రభాస్ ప్రేమించే పద్దతి చూసి.. తిరిగి అతన్ని అమితంగా ప్రేమించేద్దాం అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. మెగాస్టార్‌తో పాటు ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి Dude! అతను ప్రేమించే పద్దతి చూసి, తిరిగి అమితంగా ప్రేమించేస్తాం. Happy Birthday Darling Prabhas! 💐Wishing you Love , Happiness and Greater Glory! Have A Wonderful year ahead అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్‌లో పేర్కొన్నారు. రామ్ చరణ్ కూడా ట్విట్టర్ వేదికగా.. నా మిత్రుడు ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.
ఇంకా డైరెక్టర్ బాబీ, ఆది సాయికుమార్, ప్రశాంత్ వర్మ, గోపీచంద్, అనిల్ రావిపూడి, నారా రోహిత్, గోపీచంద్ మలినేని, రామజోగయ్య శాస్త్రి, మారుతి వంటి వారంతా ట్విట్టర్ ఎక్స్ ద్వారా ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఫ్యాన్స్ అయితే.. అర్థరాత్రి నుంచే ప్రభాస్ బర్త్‌డే ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు. అర్థరాత్రి పెద్దమ్మతల్లి గుడి దగ్గర గల ప్రభాస్ ఇంటికి భారీగా ఫ్యాన్స్ చేరుకోవడంతో.. పోలీసులు రంగప్రవేశం చేయాల్సిన పరిస్థితి నెలకొందని తెలుస్తోంది.