మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కెరీర్‌లోనే దేవర సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి.. దాదాపు రూ. 500కి పైగా కోట్లను రాబట్టింది. సెప్టెంబర్ 27న విడుదలైన ఈ సినిమా ఇంకా అక్కడక్కడా హౌస్‌ఫుల్స్‌తో రన్ అవుతుండటం విశేషం. అయితే ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ వేరు, అక్కడ విడుదల చేస్తున్న పోస్టర్స్‌పై ఉన్న కలెక్షన్స్ వేరు అనేలా.. కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఏదయితేనేం.. మేకర్స్ మాత్రం ఈ సినిమా రూ. 500 కోట్లను బీట్ చేసినట్లుగా అధికారికంగా తెలిపారు. ఇక ఈ సినిమా సాధించిన విజయంపై ఎన్టీఆర్ కూడా తన ఆనందాన్ని ఓ లేఖ ద్వారా తెలియజేశారు.
ఈ విజయం తనకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో తెలుపుతూ.. ఆ ఆనందానికి కారణమైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా తారక్ ధన్యవాదాలు తెలిపారు. ఈ అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు, అభిమానులకు, చిత్ర బృందానికి, మీడియాకు హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ తారక్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. థియేటర్లలో దుమ్మురేపిన ఈ సినిమా ఇక ఓటీటీకి వచ్చే సమయం ఆసన్నమైంది. అతి త్వరలోనే ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. అందుకు సింబాలిక్‌గా మేకర్స్ వీడియో సాంగ్స్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు.
తాజాగా ఈ మూవీలోని ఆయుధ పూజ ఫుల్ వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ సాంగ్ ఇప్పుడు టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇలా వీడియో సాంగ్స్ వదిలారంటే.. అతి త్వరలోనే సినిమా ఓటీటీలోకి వస్తున్నట్లుగా అర్థం. మరి ఎప్పుడు ఓటీటీకి వస్తుందనేది ఇప్పటికైతే అధికారిక ప్రకటన అయితే లేదు కానీ.. ఈ వీడియో సాంగ్‌తో ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతున్నారు. కొరటాల శివ తెరకెక్కించిన ఈ దేవర చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ భైరాగా, జాన్వీ కపూర్ ఫీమేల్ లీడ్‌గా నటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌ల మీద కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మించారు.