ఆర్ఆర్ఆర్ మూవీ అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సెన్సేషనల్ మూవీని జక్కన్న ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రానికి సంబంధించి సాలిడ్ అప్డేట్ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కనున్న ఈ మూవీ విషయాలను కథా రచయిత విజయేంద్రప్రసాద్ చెప్పడం మినహా.. మరే ఇతర అప్డేట్ ఇంత వరకు రాలేదు. జనవరి నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని ఇటీవల విజయేంద్రప్రసాద్ తెలిపారు. అంతే అప్పటి నుండి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమా మొదలవుతుందా? ఎప్పుడెప్పుడు అప్డేట్ వదులుతారా? అని ఎంతగానో వేచి చేస్తున్నారు. అలాంటి వారందరి కోసం జక్కన్న తాజాగా ఓ లీడ్ వదిలారు.
దర్శకుడు రాజమౌళి ఓ అంతర్జాతీయ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకలో మహేష్‌తో చేసిన సినిమాకు సంబంధించి ఓ అప్డేట్‌ని తెలియజేశారు. అదేంటంటే.. ఈ సినిమాలో ఆర్ఆర్ఆర్‌ని మించేలా జంతువులను జక్కన్న వాడబోతున్నాడట. ఆర్ఆర్ఆర్‌లో లారీలతో జంతువులను తీసుకొచ్చి, బ్రిటీష్ వాళ్లపై వదిలే ఎపిసోడ్.. ఆ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈసారి జంగిల్ నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ అంటే.. జక్కన్నతో మాములుగా ఉండదుగా..
ఇక జక్కన్న ఏం చెప్పారంటే.. జంతువులంటే నాకు చాలా ఇష్టం. ఆర్ఆర్ఆర్‌తో పాటు ఇంతకు ముందు నేను చేసిన సినిమాలో ఏదో ఒక చోట జంతువులను ఉపయోగించాను. ఇప్పుడు చేయబోయే సినిమాలో మాత్రం ఆర్ఆర్ఆర్ కంటే కూడా ఎక్కువ జంతువులను ఉపయోగించబోతున్నాను.. అని చెప్పడంతో.. ఒక్కసారిగా ఈ సినిమా వార్తలలోకి వచ్చేసింది. దీంతో రాజమౌళి, మహేష్ సినిమా అప్డేట్ అంటూ సోషల్ మీడియా అంతా టామ్ టామ్ చేస్తున్నారు.