Advertisement
Google Ads BL

అస్సలు తగ్గనంటోన్న బాలయ్య


నందమూరి బాలకృష్ణ - బాబీ కలయికలో సితార ఎంటర్టైన్మెంట్ తెరకెక్కిస్తున్న NBK 109 చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఈ చిత్ర రిలీజ్‌పై మాత్రం నందమూరి అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నడుస్తుంది. డిసెంబర్‌లో NBK 109 రిలీజ్ ఉండదు. ఇది ఫిక్స్. సంక్రాంతికి బాలయ్య-బాబీ కాంబో మూవీని దించే ప్లాన్‌లో నాగవంశీ ఉన్నాడు. 

Advertisement
CJ Advs

కానీ ఆ తేదీని దసరాకు ఫైనల్ చేసి ప్రకటిస్తారనుకుంటే దసరా వెళ్ళిపోయింది. దివాళి వస్తుంది. దీపావళి కైనా NBK 109 డేట్ లాక్ చేసి ప్రకటిస్తారో లేదో కానీ బాలకృష్ణ మాత్రం జనవరి 12 సంక్రాంతికి సినిమాని విడుదల చెయ్యమంటున్నారట. జనవరి 10న గేమ్ ఛేంజర్ రాబోతుంది. ఇప్పటికే డేట్ లాక్ చేసి ప్రకటించారు. 

ఇంకా సంక్రాంతికి రావాల్సిన మూవీస్ విషయంలో క్లారిటీ రావడం లేదు. కానీ బాలయ్య మాత్రం సంక్రాంతికి ఫిక్స్ చేయమని నిర్మాతలకు చెబుతున్నారట. సంక్రాంతి బరిలో ఎవరున్నా తగ్గేదేలే అంటున్నారట. మరి బాలయ్య కోరుతున్నట్టుగా పవర్ ఫుల్ గ్లింప్స్‌తో NBK 109 మాస్ పూనకాలు తెప్పించేందుకు జనవరి 12న వస్తుందో.. లేదంటే మరేదన్నా తేదీ చూసుకుంటుందో.. అనేది మాత్రం సస్పెన్స్‌గా మారింది. బాలయ్య, బాబీ కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి.

Natasimham Balayya on His NBK109 Release Date:

Balakrishna Wants NBK109 Sankranthi Release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs