కొన్నాళ్లుగా అంటే బాహుబలి తర్వాత ప్రభాస్ ఎన్ని వర్కౌట్స్ చేసినా, ఎంతమంది ట్రైనర్లు ని పెట్టుకుని కష్టపడినా అస్సలు వెయిట్ తగ్గలేదు. బాహుబలి తర్వాత రాధేశ్యామ్, ఆదిపురుష్, సాహో ఇలా ప్రతి సినిమాలో ప్రభాస్ లుక్ పై పలు విమర్శలు రావడమే కాదు, ఫ్యాన్స్ కు కూడా ప్రభాస్ లుక్ విషయంలో అసంతృప్తి ఉంది.
సలార్, కల్కి ప్రభాస్ కటౌట్ కి తగ్గ మాస్ ఎలిమివేషన్ ఉన్న సినిమాలు కావడంతో ప్రభాస్ లుక్స్ ఎక్కడా ఎబ్బెట్టుగా కనిపించలేదు. కానీ ఇప్పుడు ప్రభాస్.. ఫ్యాన్స్ కి నచ్చే మెచ్చే లుక్ లోకి మారిపోయారు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ లో మాత్రం లవర్ బాయ్ లుక్ లో అభిమానులను ఇంప్రెస్స్ చేస్తున్నారు.
అక్టోబర్ 23 అంటే బుధవారం ప్రభాస్ బర్త్ డే కి రాజా సాబ్ నుంచి రాబోతున్న సర్ ప్రైజ్ కి సంబందించిన అప్ డేట్ తో పాటుగా ప్రభాస్ రాజా సాబ్ పోస్టర్ వదిలారు. అందులో ప్రభాస్ ని చూస్తే ఫ్యాన్స్ కడుపు నిండిపోతుంది. ప్రభాస్ ని అలా స్టైలిష్ లుక్ లో చూస్తే ఇది కదా ఫ్యాన్స్ కు కావాల్సింది అంటారు.