బిగ్ బాస్ సీజన్ 8 లో ఫేక్ ఓటింగ్ నడుస్తుందా.. అనధికార పోల్స్ అంటూ పలువురు సోషల్ మీడియాలో పోల్స్ పెడితే అందులో వచ్చే ఓటింగ్ ఒకటి, బిగ్ బాస్ వీకెండ్ లో చూపించే ఓటింగ్ ఒకటా.. ఇప్పుడదే అందరిలో మెదులుతున్న ప్రశ్న. కారణం బిగ్ బాస్ లీకుల కన్నా ముందే ఈ పోల్స్ లో ఎవరు వారం వారం ఎలిమినేట్ అవుతారనే విషయంలో ఒక అంచనాకు వచ్చేస్తున్నారు.
గత వారం నిఖిల్, నబీల్ లు ఓటింగ్ లో మొదటి స్థానంలో ఉంటే.. చివరిగా పృథ్వీ, హరితేజ, టేస్టీ తేజ లు డేంజర్ జోన్ లో నడిచారు. ఫైనల్ గా హరితేజ కానీ టేస్టీ తేజ కానీ ఎలిమినేట్ అవుతారనుకుంటే ఇక్కడ బిగ్ బాస్ యాజమాన్యం బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. డేంజర్ జోన్ లో హౌస్ నుంచి వెళ్ళిపోతానంటున్న నాగమణికంఠ ను, అలాగే ఓటింగ్ లో ఐదో స్థానంలో కొనసాగిన గౌతమ్ ను పెట్టారు.
ఇక హరితేజ-టేస్టీ తేజ లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారనుకున్న ప్రేక్షకులకు నాగార్జున షాకిచ్చారు. నాగమణికంఠ.. నువ్వు హౌస్ ను వీడాలనుకుంటున్నావా అంటూ నాగ్ 1,2,3 కౌంట్ చేసేసరికి నాగమణికంఠ నేను వెళ్ళిపోతాను అన్నాడు. మరి ఆడియన్స్ ఒపీనియన్ ఎలా ఉందొ చూడమంటే.. అక్కడ నాగమణికంఠ సేవ్ అయ్యి గౌతమ్ ఎలిమినేట్ అవ్వాల్సింది.
జస్ట్ గౌతం తపించుకున్నాడు. కానీ బయట జరిగిన ఓటింగ్ కు హౌస్ లో జరిగిన ఎలిమినేషన్ కు అస్సలు పొంతన లేకపోవడం చూసి బిగ్ బాస్ బాస్ లో అంతా ఫేక్ ఓటింగ్ అంటూ మాట్లాడుకుంటున్నారు.