టాప్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం మొరాకో వెకేషన్లో ఎంజాయ్ చేస్తుంది. చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ తార ఖాళీ సమయాల్లో ఇలా వెకేషన్ లో సేద తీరుతుంది. అందమైన లొకేషన్‌లో తన ప్రెండ్స్ గ్యాంగ్‌తో కలిసి తిరుగుతూ పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
ఆమె పోస్ట్ చేసిన పిక్స్ లో బ్లూ కలర్ దుస్తుల్లో త్రిష షైనింగ్ అవుతూ కనిపించింది. మరీ స్టైలిష్ గా కాకుండా సాంప్రదాయంగానే త్రిష డ్రెస్సింగ్ స్టయిల్ ఉంది. చేతిలో ట్రెండీ బాగ్ వేసుకుని త్రిష చాలా క్యూట్ గా కనిపించింది. పొన్నియన్ సెల్వన్ చిత్రం తర్వాత త్రిష రేంజ్, క్రేజ్ రెండూ పెరిగాయి. వరస సినిమాలు, అందుకు తగ్గ అందంతో త్రిష మెరిసిపోతుంది.
40 ప్లస్ లోను త్రిష అందాలు ఇంకా ఇంకా పెరుగుతున్నాయి తప్ప తరగడం లేదు. ఇక ప్రస్తుతం త్రిష విదా ముయార్చి, విశ్వంభర, గుడ్ బ్యాడ్ అగ్లీ, రామ్, థగ్ లైఫ్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ లో స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది.