నందమూరి నటసింహ బాలకృష్ణ కొన్నాళ్లుగా లుక్స్ విషయంలో అభిమానులను ఇంప్రెస్స్ చెయ్యని రోజు లేదు. గతంలో బాలయ్య కథలు బావున్నా లుక్స్ విషయంలో వచ్చిన నెగిటివిటి అందరికి తెలిసిందే, కానీ గత కొద్ధి సినిమాల నుంచి బాలయ్య స్టయిల్ మారిపోయింది. కారణం ఆయన చిన్న కుమార్తె తేజస్విని బాలయ్య వెనుక ఉండడం కారణమనే మాట ఎప్పటినుంచొ వినిపిస్తోంది.
అలాగే ఆహా అన్ స్టాపబుల్ లో కూడా బాలయ్య లుక్ కి ఫిదా కానీ ప్రేక్షకులు లేరు. అన్ స్టాపబుల్ లో బాలకృష్ణ కాస్ట్యూమ్స్ కానివ్వండి, ఆయన హెయిర్ స్టయిల్ కానివ్వండి ప్రతి విషయంలో అభిమానులు అడుగడుగునా సర్ ప్రైజ్ అయ్యారు. తాజాగా బాలయ్య లుక్ చూస్తే వావ్ సూపర్ కూల్ లుక్ అంటారేమో..
ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతున్న అన్ స్టాపబుల్ టాక్ షో సీజన్ 4 కోసం మొదటి ఎపిసోడ్ షూట్ లో బాలయ్య పై లుక్ కనిపించారు.. ఆ లుక్ లో కిక్క్అనిపించిన బాలకృష్ణ ను ఫ్యాన్స్ తెగ పొగుడుతున్నారు. మొదటి ఎపిసోడ్ ను బావ, ఏపీ సీఎం చంద్రబాబు తో బాలయ్య అన్ స్టాపబుల్ షో ఆడించబోతున్నారు. ప్రస్తుతం దానికి సంబందించిన షూట్ జరుగుతుంది.