Advertisement
Google Ads BL

పుష్ప 2 ఐటమ్ గర్ల్ ఫిక్స్


పుష్ప ద రూల్ ఐటమ్ సాంగ్ విషయంలో నిన్నటివరకు తర్జన భర్జనలు జరిగాయి. పుష్ప 1 స్పెషల్ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో అంతకు మించి అనేలా పుష్ప 2 స్పెషల్ సాంగ్ ఉండాలని సుకుమార్ ఆలోచించి ఆలోచించి ఐటమ్ సాంగ్ లో కనిపించే హీరోయిన్ కోసం వెతికి వెతికి ఫైనల్ గా ఆ హీరోయిన్ ని సెట్ చేసినట్లుగా తెలుస్తోంది. 

Advertisement
CJ Advs

ముందు నుంచి జాన్వీ కపూర్ ని, అలాగే యానిమల్ లో కనిపించిన తృప్తి దిమ్రి అయితే ఇంకా బావుంటుంది అనే ఆలోచన చేసినా ఫైనల్ గా ఇప్పుడు జాన్వీ కపూర్ కాదని మరో బాలీవుడ్ హీరోయిన్ ను సుకుమార్ కన్ ఫర్మ్ చేసేసారట. ఆమె ఎవరో కాదు సాహో బ్యూటీ శ్ర‌ద్దా కపూర్. స్త్రీ 2 తో సూపర్ సక్సెస్ కొట్టిన శ్రద్ద కపూర్ అయితే పుష్ప 2 ఐటమ్ సాంగ్ కి క్రేజ్ వస్తుంది అనుకుంటున్నారట. 

ఈ పాటను నవంబర్ లో తెరకెక్కిస్తారని, ఈ పాట లో ఆడేందుకు శ్ర‌ద్దా క‌పూర్ ఏకంగా 4 కోట్లు డిమాండ్ చేసింద‌ని, అడిగినంతా ఇవ్వ‌డానికి మైత్రీ మూవీస్ కూడా రెడీ అయినట్లుగా తెలుస్తోంది. 

Shraddha Kapoor for Pushpa 2 special song:

Shraddha Kapoor to Star in Pushpa-2 Item Song
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs