అప్పట్లో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి గాను తండ్రి వైస్సార్ చనిపోయాక ఓదార్పు యాత్ర చేసిన జగన్ మోహన్ రెడ్డి అటుపిమ్మట పాద యాత్ర అంటూ చేస్తూ ప్రజల్లోకి వెళ్లి అధికారంలోకి వచ్చి సీఎం అయ్యాడు. ఆతర్వాత ఆ ప్రజలను పక్కన పెట్టేసిన జగన్ ఇప్పుడు అధికారం పోయాక పరామర్శ యాత్ర మొదలు పెట్టాడు.
ఓడిపోయిన నేతలను, కార్యకర్తలను జగన్ పరామర్శిస్తున్నాడు అంటే తప్పులో కాలేసినట్లే. జగన్ పరామర్శిస్తున్నది.. వైసీపీ అధికారంలో ఉండగా రెచ్చిపోయి తప్పులు చేసిన నేతలను కూటమి ప్రభుత్వం జైల్లో పెడుతుంది. ఆ నేతలను జగన్ పనిగట్టుకుని పరామర్శిస్తున్నారు. అందుకే అనేది అప్పుడు పాదయాత్ర-ఇప్పుడు పరామర్శ యాత్ర అని.
వైసీపీ ప్రభుత్వం ఓటమి పాలవకముందే ఈవీఎం లను పగులగొట్టిన కేసులో పిన్నెల్లి రామకృష్ణ ను అరెస్ట్ చెయ్యగా.. బెంగుళూరు ప్యాలెస్ లో సేద తీరుతున్న జగన్ హుటాహుటిన జైలులో ఉన్న పిన్నేల్లిని పరామర్శించడానికి వచ్చేసాడు. ఆ తర్వాత టీడీపీ ఆఫీస్ పై రాళ్ల దాడిలో పాలు పంచుకున్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ని అరెస్ట్ చెయ్యగా.. ఆయన్ని పరామర్శించి వచ్చాడు జగన్.
ఇక ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను చంపేస్తా, నరికేస్తా అంటూ రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్ కుమార్ పోలీసులకు చిక్కాడు. ప్రస్తుతం అనిల్ కుమార్ జైలులో పోలీస్ విచారణలో ఉన్నాడు. మరి వైసీపీ నేతలంతా వరసగా జైలుకెళుతుంటే జగన్ ఇలా పరామర్శ యాత్ర చేస్తూ మళ్లీ అధికారంలోకి వస్తాడేమో చూడాలి అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.