Advertisement
Google Ads BL

ఈసారి సీఎం హోదాలో బాలయ్యతో బాబు


ఆహా అన్ స్టాపబుల్ టాక్ షో గత మూడు సీజన్స్ ఎంతగా సక్సెస్ అయ్యాయో అందరూ చూసారు. పలువురు స్టార్ సెలబ్రిటీస్ తో నందమూరి బాలయ్య ఆట, మాట అన్ని అభిమానులను ఉర్రుతలూగించాయి. సూపర్ స్టార్ మహేష్ దగ్గర నుంచి స్టార్ ప్రభాస్ వరకు చాలామంది సెలబ్రిటీస్ ఈ టాక్ షో లో బాలయ్య తో కలిసి అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. 

Advertisement
CJ Advs

ఇప్పుడు అన్ స్టాపబుల్ టాక్ సీజన్ 4 మొదలయ్యింది. ఇంకా స్ట్రీమింగ్ కానీ ఈ సీజన్ కు చంద్రబాబు మొదటి గెస్ట్ గా హాజరవ్వబోతున్నారు గత సీజన్ లో చంద్రబాబు ప్రతిపక్ష హోదాలో బాలయ్య షో కి రాగా.. ఇప్పుడు చంద్రబాబు సీఎం హోదాలో బాలయ్య రాక‌తో ఈ షోకు మ‌రింత క‌ళ వ‌చ్చిన‌ట్టైంది. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ రేపు హైద‌రాబాద్ లోని అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో వేసిన సెట్ లో జ‌ర‌గ‌బోతోంది. 

చంద్ర‌బాబు నాయుడుతో పాటు ఈ ఎపిసోడ్ లో ఎవ‌రెవ‌రు పాల్గొంటారు, గతంలోలా తండ్రి తో పాటుగా మినిస్టర్ హోదాలో లోకేష్ కూడా వస్తారా అనేది తెలియాల్సి ఉంది. అంతేకాదు ఈ షో లో చంద్రబాబు అధికారంలో లేనప్పుడు జరిగిన తన అరెస్ట్ విషయమై ఏమైనా మాటలు వస్తాయేమో అని అందరూ ఇప్పటినుంచే ఎదురు చూస్తున్నారు. 

Babu with Balayya as CM this time:

AP CM Nara Chandrababu for first episode of Unstoppable 4
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs