Advertisement
Google Ads BL

కృతి శెట్టి కి టాలీవుడ్ యంగ్ హీరో ఆఫర్


క్యూట్ బ్యూటీ కృతి శెట్టి కి టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ నిరాశ పరిచే సినిమాలు రావడంతో మెల్లగా తమిళంలో పాగా వెయ్యడానికి రెడీ అయ్యింది. అక్కడ కూడా క్రేజీ తమిళ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న కృతి శెట్టి కి ఎక్కువగా తెలుగు సినిమాలపైనే ప్రేమ కనబడుతుంది. 

Advertisement
CJ Advs

అందుకే టాలీవుడ్ పై దృష్టి ప్రత్యేక దృష్టి పెడుతుంది. ఇక్కడ వచ్చే అవకాశాలను చేజారకుండా ఒడిసిపట్టుకుంటుంది. కానీ ఆమెకు వరసగా ప్లాప్ సినిమాలు ఉండడంతో ఆమెకు ఆఫర్స్ ఇచ్చేందుకు యంగ్ హీరోలు ముందుకు రావట్లేదు. శర్వానంద్ మనమే తో బౌన్స్ బ్యాక్ అవుదామనుకుంటే ఆ సినిమా కూడా ఆమెకు హెల్ప్ చెయ్యలేదు. 

తాజాగా కృతి శెట్టి కి టాలీవుడ్ లో బంపర్ ఆఫర్ తగిలింది అనే న్యూస్ నడుస్తుంది. అది కుర్ర హీరో విశ్వక్ సేన్ తన తదుపరి సినిమా అంటే జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ తో చెయ్యబోయే మూవీలో కృతి శెట్టి ని హీరోయిన్ గా అనుకుంటున్నారట. ప్రస్తుతం మెకానిక్ రాకీ, లైలా సినిమాలు చేస్తున్న విశ్వక్ సేన్ అనుదీప్ తో చెయ్యబోయే మూవీలో కృతి శెట్టి తో రొమాన్స్ చేస్తాడని అంటున్నారు. 

మరి విశ్వక్ సేన్ ఆఫర్ కృతి శెట్టి ని మళ్లీ టాలీవుడ్ లో బిజీ చేస్తుందేమో చూడాలి. 

Tollywood young hero offer to Krithi Shetty:

Krithi Shetty Hero Vishwak Sen Is Going To Do A Movie Under The Direction Of Director Kv Anudeep
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs