Advertisement
Google Ads BL

సజ్జల డైరెక్షన్ లో బోరుగడ్డ సినిమా


వైసీపీ ప్రభుత్వం వచ్చాక చాలామంది వైసీపీ నేతలు ప్రతిపక్షాలపై నోరేసుకుపడిపోతే ఓ విధంగా ఉండేది. కానీ చంపేస్తా, నరికేస్తా, కోసేస్తా అంటూ రెచ్చిపోయి వార్నింగ్ లు ఇచ్చారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లపై ఇష్టం వచ్చినట్టుగా చెలరేగిపోయిన కొడాలి నాని, రోజా, వల్లభనేని వంశీ, బుగ్గన, చిదిరి, అంబటి, జోగి వీళ్ళందరికీ 2024 ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు. 

Advertisement
CJ Advs

కానీ బోరుగడ్డ అనిల్ అనేవాడు ఎన్నికల్లో పోటీ విషయం పక్కనపెడితే.. పని ఉన్నా, లేకపోయినా యూట్యూబ్ ఛానల్స్ లో కూర్చుని చంద్రబాబు, లోకేష్, పవన్ లను చంపేస్తా, జగన్ చెబితే నరికేస్తా అంటూ మీటింగ్ లు పెట్టాడు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బోరుగడ్డ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. 

రీసెంట్ గా బోరుగడ్డ అనిల్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే పోలీస్ విచారణలో భాగంగా బోరుగడ్డ అనిల్ కుమార్ తాను చేసిన హెచ్చరికలు, మాట్లాడిన బూతులన్నీ వైసీపీ ఆఫీసు నుంచి వచ్చిన ఆదేశాల మేరకే అంటూ వాంగ్మూలం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వైసీపీకి సపోర్ట్ చేసే యూట్యూబ్ చానళ్లు మీ దగ్గరకు ఫలానా రోజు ఇంటర్యూకు వస్తాయి, అప్పుడేం మాట్లాడాలో అంతా అనిల్ ఇంట్లో దొరికిన లాప్ టాప్ లో సమాచారం ఉన్నట్లుగా తెలుస్తుంది. 

అయితే ఆ స్క్రిప్ట్ అంతా సజ్జల ఆఫీసు నుంచి వచ్చేవని.. తాను అందుకే అలా మాట్లాడానని బోరుగడ్డ అనిల్ పోలీస్ ల ముందు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. మరి సజ్జల దర్శకత్వంలోనే బోరుగడ్డ అనిల్ బూతు సినిమా నడిచినట్లుగా పోలీసులు నిగ్గు తేల్చే పనిలో ఉన్నారు. 

Borugadda movie directed by Sajjala:

Borugadda Anil Arrested 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs