సినిమా ఇండస్ట్రీలో పలువురు నటీమణులు తమని కమిట్మెంట్ అడిగారు అంటూ బహిరంగంగానే క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తున్నారు. సినిమా పరిశ్రమలో తాము ఎదుర్కున్న సవాళ్లతో పాటుగా తాము ఇబ్బందిపడిన విషయాలను పంచుకుంటున్నారు. తాజాగా అనన్య నాగళ్ళ ఈ క్యాస్టింగ్ కౌచ్ పై ఓ జర్నలిస్ట్ కు ఇచ్చిన ఆన్సర్ వైరల్ కాదు హాట్ టాపిక్ గా మారింది.
పొట్టేల్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మీడియా వారు ప్రశ్నలు అడుగుతున్న సందర్భంలో ఓ జర్నలిస్ట్ సినిమా ఇండస్ట్రీకి తెలుగు అమ్మాయిలు రాకపోవడానికి ప్రధాన కారణం క్యాస్టింగ్ కౌచ్ అంటారు, అంతేకాదు ఆఫర్స్ పొందాలంటే కమిట్మెంట్ అడుగుతారని అంటారు అది నిజమా, కమిట్మెంట్ ఇస్తే ఒక రెమ్యూనరేషన్ కమిట్మెంట్ ఇవ్వకపోతే మరో రెమ్యూనరేషన్ ఉంటుందా అని అడగగా..
అనన్య నాగళ్ళ ఆన్సర్
ఏ ఇండస్ట్రీలో అయినా పాజిటివ్, నెగెటివ్ రెండూ ఉంటాయి. మీరు ఎక్స్ పీరియన్స్ చెయ్యకుండా ఎలా అడుగుతున్నారు, నేను ఇండస్ట్రీలోనే ఉన్నాను, నటిగా ఉన్నాను, ఇక్కడ క్యాస్టింగ్ కౌచ్ లాంటివి లేవు, ఇక కమిట్మెంట్ ఉంటే పారితోషకం ఎక్కువ, లేకుంటే తక్కువ అనేది మీరు విన్నది చెబుతున్నారు. కానీ నేను ఇక్కడే ఉన్నాను, నేను చూసాను, మీరు అనుకున్నది ఇక్కడ లేదు అంటూ అనన్య నాగళ్ళ కుండ బద్దలు కొట్టింది.