ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ పాలనా వ్యవహారాలతో పాటుగా ఆయన పూర్తి చెయ్యాల్సిన సినిమా షూటింగ్స్ తో బిజీగా వున్నారు. గత నెల 22 న హరి హర వీరమల్లు సెట్స్ లో జాయిన్ అయిన పవన్ కళ్యాణ్ చక చకా వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు. చాలా కొద్దిమేర మిగిలి ఉన్న ఈసినిమా షూటింగ్ పవన్ నవంబర్ 8 కల్లా పూర్తి చేయనున్నారనే టాక్ ఉంది.
క్రిష్ దర్శకత్వంలో మొదలైన వీరమల్లు ఇప్పుడు చేతులు మారి జ్యోతి కృష్ణ దర్శకత్వంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. అమరావతి లో స్పెషల్ సెట్ లో హరి హర వీరుమల్లు షూటింగ్ జరుగుతుంటే.. తాజాగా పవన్ కళ్యాణ్ ఓ పాటను గంటలో పూర్తి చేసి చూపించారనే వార్త ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.
పవన్ ప్రస్తుతం షూటింగ్ చేస్తున్న వీరమల్లు సెట్స్ లోనే రీ రికార్డింగ్ కోసం స్పెషల్ సెటప్ చేసి పవన్ తో ఆ పాటను ఒక గంటలో ఫినిష్ చేసేసారట మేకర్స్. వీరమల్లు లో సందర్భానుసారం పవన్ గొంతులో పాడాల్సిన సాంగ్ ఒకటి ఉంటుందట. ఆ సాంగ్ ఐడియా కూడా పవన్ దేనట. మరి పవన్ ఈ రేంజ్ స్పీడు లో సినిమాలు పూర్తి చేస్తే అభిమానులు హ్యాపీ, నిర్మాతలు డబుల్ హ్యాపీ.