ఏపీలో కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ-జనసేన-బీజేపీ లు కలిసి ఉంటే.. అక్కడ కేంద్రంలో NDA కూటమిలో టీడీపీ ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తుంది. గత ఐదేళ్ళలో మోడీ-చంద్రబాబు అంటీముట్టనట్టుగా ఉంటే.. ఇప్పుడు మాత్రం మోడీ చంద్రబాబు కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారు.
తాజాగా చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అక్కడ మోడీ, అమిత్ షా లతో చర్చలు జరిపారు. అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ లకు సహాయం చేసినందుకు చంద్రబాబు మోడీ కి ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలియజెయ్యడమే కాదు.. ఢిల్లీ వేదికగా చంద్రబాబు జగన్ కు చెక్ పెట్టబోతున్నారంటూ బ్లూ మీడియా హడావుడి మొదలు పెట్టేసింది.
ఢిల్లీ లో ఉన్న చంద్రబాబు వివేకా హత్య కేసు లో అవినాష్ రెడ్డిపై ఛార్జ్ షీట్ దాఖలు చేసి సిబిఐ తన పని మొదలు పెట్టాలని కోరారు. అంతేకాదు జగన్ పై ఉన్న కేసులు విషయంలో దర్యాప్తు వేగవంతం చెయ్యాలని ఆయన కోరారు. ఈసారి జగన్ ను ఎలాగైనా జైలుకు పంపించే ఏర్పాట్లలో చంద్రబాబు పకడ్బందీ ఏర్పాట్లలో ఉన్నట్లుగా బ్లూ మీడియాలో కథనాలు ప్రచారంలోకి వచ్చేసాయి.