ఏజెంట్ నిరాశ పరచడంతో అక్కినేని ప్రిన్స్ అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. అసలు ఏజెంట్ డిసాస్టర్ తర్వాత లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తున్న అఖిల్ ఈమధ్యన కొండా సురేఖ విషయంలో సోషల్ మీడియా వేదికగా ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు. మరోపక్క అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో అభిమానుల ఆరాటం ఎప్పుడు తీరేనా అని ఎదురు చూడని రోజు లేదు.
తాజాగా అఖిల్ తన తదుపరి సినిమా విషయంలో తెగ ట్రెండ్ అవుతున్నాడు. అనిల్ అనే కొత్త దర్శకుడి తో అఖిల్ తన కొత్త ప్రాజెక్ట్ ని త్వరలోనే అనౌన్స్ చెయ్యబోతున్నాడు. ఎప్పుడో అనుకున్న కాంబినేషన్ కాకపోతే అఖిల్ ఎందుకో తెగ ఆలోచిస్తూ ఈప్రాజెక్టు ఆలస్యానికి కారణమయ్యాడు.
ప్రస్తుతం అఖిల్ ఏజెంట్ లుక్ లోనే కనిపించినా.. అనిల్ తో చెయ్యబోయే చిత్రం కోసం స్పెషల్ మేకోవర్ లోకి మారబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు కనిపించినట్టుగా కాకుండా సరికొత్త మెకోవర్లోకి అఖిల్ మారతాడని, అఖిల్ లుక్ చూసి అందరూ సర్ ప్రైజ్ అయ్యేలా అతని లుక్ ఉండబోతుంది అని తెలుస్తోంది.
ఇక అఖిల్-అనిల్ ప్రాజెక్ట్ సంక్రాంతి తర్వాత సెట్స్ మీదకి వెళ్ళబోతున్నట్టుగా సమాచారం.