Advertisement

కేసీఆర్.. సారు వచ్చేస్తున్నారహో


అవును.. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మౌన వ్రతం ముగిసింది..! ఇది కాస్త సెటైర్ అనుకుంటారే కానీ గులాబీ బాస్ రాజకీయ వ్యూహాల్లో మౌనానిది కీలక పాత్ర అని సారు అత్యంత సన్నిహితులు చెబుతున్న మాట. ఇన్నాళ్లు అధికార కాంగ్రెస్ పార్టీకి సమయం ఇచ్చారనేది మరికొందరి వాదన. ఏదైతేనేం ఇప్పుడు కేసీఆర్ జనాల్లోకి వచ్చే సమయం ఆసన్నమైంది. ఫాం హౌస్ నుంచి బాస్ బయటికి వస్తే పరిస్థితి వేరేలా ఉంటుందని గులాబీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.

Advertisement

ఇన్నాళ్లు ఇలా..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు లేకపోవడం.. పార్లమెంట్ ఎన్నికల్లో అయినా పరువు నిలుపుకుందామని భావించి జీరోకు పరిమితమై బొక్కబోర్లా పడింది. నాడు హైదరాబాద్ వదిలి ఫాం హౌస్ కు వెళ్లిన సారు.. ఆ మధ్య కనిపించినా అంతంత మాత్రమే. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మధ్య గొడవలు జరిగినా, ప్రజా సమస్యల విషయంలో, ప్రభుత్వం వ్యతిరేకతపై, హైడ్రా, మూసి పరివాహక బాధితులు, రైతులు, రుణమాఫీ ఇలా ఏ అంశంలోనూ ప్రెస్ మీట్.. కనీసం ప్రెస్ నోట్ కూడా విడుదల చేయలేదు కేసీఆర్. ఐతే ఇక అన్నీ వదిలేసి ప్రజాక్షేత్రంలోకి బాస్ విచ్చేస్తున్నారు.

సమయం వచ్చేసింది!

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ నెలకు ఏడాది పూర్తి అవుతుంది. ఇక అప్పటినుంచి ప్రజలలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం మాస్టర్ ప్లాన్ సర్వం సిద్ధం అయ్యింది. తొలుత రైతుల సమస్యలు, హైడ్రా కూల్చివేతలు ఇలా ఒక్కో విషయంపై పోరాటం చేస్తూ.. బాధితులకు అండగా నిలుస్తారట. అంతే కాదు.. ప్రత్యక్షంగా ఆందోళనలు, నిరసనలు, బహిరంగ సభలు, ర్యాలీలలో కూడా పాల్గొంటారట. అనంతరం జిల్లాల యాత్ర కూడా చేస్తారట. గ్రామ స్థాయి మొదలుకుని నియోజవర్గం, జిల్లాల వారీగా పార్టీ కమిటీలు నియమించి రేవంత్ సర్కారుపై పోరు సాగిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి చూస్తే చాలా కాలం తర్వాత సారు బయటికి వస్తున్నారు.. అధికార పార్టీపై పోరాటం ఎలా ఉంటుందో..? సభలు, మీడియా వేదికగా ఏమేం మాట్లాడుతారో..? పరిస్థితి ఎలా ఉంటుందో..? ఏంటో చూడాలి మరి.

KCR is coming:

KCR will be active from December
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement