పలువురు సినీ తారలు తమకున్న క్రేజ్ తో తమ వద్దకు కొచ్చే ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేస్తూ యాడ్స్ చేస్తూ కస్టమర్స్ ను అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. సఫాజ్ సోప్స్ నే తీసుకోండి.. సెలబ్రిటీస్ వాడిన సోప్స్ ని కొనడానికి సదరు వినియోగదారులు రెడీగా ఉంటారు. అవి కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా బోలెడన్ని బ్రాండ్స్ కి సినీ తారలు బ్రాండ్ అంబాసిడర్లు గా ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. అంతవరకూ ఓకె.
కానీ మరికొంతమంది సినీ తారలు బెట్టింగ్స్ యాప్స్ ప్రమోట్ చేస్తూ చేతినిండా డబ్బులు సంపాదిస్తారు. ఆ బెట్టింగ్స్ యాప్స్ లో చాలామంది బెట్టింగ్స్ ఆడుతూ డబ్బు పోగొట్టుకుంటారు. ఆ స్కామ్ బయటపడినప్పుడు సినీ తారలు కోర్టు మెట్లెక్కాల్సి ఉంటుంది. గతంలోనే చాలామంది ఇలాంటి వ్యవహారాల్లో విచారణ ఎదుర్కొన్నవారు ఉన్నారు.
అలా ఇప్పుడు ఓ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో మిల్కి బ్యూటీ తమన్నా ఈడీ విచారణ ఎదుర్కొంది. ఆ బెట్టింగ్ యాప్ వ్యవహారంలోనే తమన్నా నిన్న గురువారం ఈడీ విచారణకు హాజరైంది.