తెలంగాణ మినిస్టర్ కొండా సురేఖ పర్సనల్ గా సినిమా ఇండస్ట్రీలోని అక్కినేని ఫ్యామిలీ అందులోను సమంత ను టార్గెట్ చెయ్యడం పై సినిమా ఇండస్ట్రీ నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. ప్రతి ఒక్కరు నాగార్జున, సమంత ను సపోర్ట్ చేస్తూ ట్వీట్స్ వేశారు. కొండా సురేఖ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి నాగార్జున అలాగే సమంత లపై నీచమైన కామెంట్స్ చెయ్యగా.. వెంటనే సమంత తన విడాకులకు రాజకీయాలకు సంబంధం లేదు అని క్లారిటీ ఇచ్చింది. కొండా సురేఖ సమంతకు సారీ చెప్పింది.
మరోపక్క నాగార్జున కొండా సురేఖ పై లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నారు. అయితే కొండా సురేఖ వ్యాఖ్యలపై సమంత మరోసారి రియాక్ట్ అయ్యింది. హనీ బన్నీ వెబ్ సీరీస్ ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ ధావన్ తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. సమంత ను మీపై వచ్చిన కామెంట్స్ పై మీరు పని చేసిన సినిమా ఇండస్ట్రీ, మీడియా ఎంతోమంది సపోర్ట్‌గా నిలిచారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని యాంకర్ అడిగాడు.
దానికి సమంత ఇచ్చిన రియాక్షన్ నెట్టింట్లో సంచలనంగా మారింది. ఈరోజు నేను ఇక్కడ కూర్చోడానికి ఎంతోమంది సపోర్ట్ కారణం. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల ప్రేమ, నాపై వారికి ఉన్న నమ్మకమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. వారు నాపై ఎంతమాత్రం గివ్ అప్ చేయలేదు. వారంతా నాలో ఎంతో ధైర్యం నింపారు. నేను కష్టాలను ఎదుర్కోవడంతో వారి సపోర్ట్ నాకెంతో సహాయపడింది అంటూ కొండా సురేఖ విషయంలో సినిమా ఇండస్ట్రీ సమంత కు చేసిన సపోర్ట్ పై సమంత స్పందించింది.