Advertisement
Google Ads BL

స్పిరిట్ లో బోలెడన్ని సర్ ప్రైజ్ లు?


 

Advertisement
CJ Advs

ప్రస్తుతం రాజా సాబ్ షూటింగ్ ఫినిష్ చేసే పనిలో బిజీగా వున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అతి త్వరలోనే హను రాఘవపూడి సినిమా సెట్స్ లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. కల్కి తర్వాత కాస్త వెకేషన్ మోడ్ లోకి వెళ్లిన ప్రభాస్ ఆ తర్వాత అస్సలు బ్రేక్ తీసుకోకుండా షూటింగ్ కి హాజరవుతున్నారు.

ఇక డిసెంబర్ లేదా జనవరి నుంచి సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ వంగ తో ప్రభాస్ స్పిరిట్ మొదలు కాబోతుంది. స్పిరిట్ లో ప్రభాస్ డ్యూయెల్ రోల్ లో కనిపిస్తారని, అలాగే  పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారనే టాక్ కాదు సందీప్ వంగా కూడా ప్రభాస్ పోలీస్ పాత్ర ను కన్ ఫర్మ్ చేసారు. ఇప్పుడు ప్రభాస్ డ్యూయెల్ రోల్ చేయ‌బోతున్నారన్న వార్త ప్రభాస్ ఫ్యాన్స్ ను ఎగ్జైట్ చేస్తుంది.

అంతేకాదు స్పిరిట్‌ లో చాలా స‌ర్‌ప్రైజ్‌లు ఉండ‌బోతున్నాయ‌ని టాక్‌ వినిపిస్తోంది. అందులో భాగంగానే ఈ చిత్రంలో ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోలు కూడా కనిపించబోతున్నారని, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ణ‌బీర్ క‌పూర్‌లు అతిధి పాత్రల్లో కనిపిస్తారని.. ప్రభాస్ విలన్ పాత్ర కోసం సందీప్ వంగ ఓ స్టార్ హీరో ను తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారట.

మరి స్పిరిట్ లో ఇన్ని సర్ ప్రైజ్ లు ఉంటే నిజంగా ఫ్యాన్స్ ఆగుతారా, ప్రభాస్ సింగిల్ గా వస్తేనే బాక్సాఫీసు ఊచకోత. అదే ఇద్దరు ముగ్గురు స్టార్స్ తో కలిస్తే అది ఏ రేంజ్ లో ఉంటుందో అనేది మాత్రం ఊహించడం కూడా కష్టమే. 

Lots of surprises in the spirit?:

Two or three star heroes will appear in cameo roles in Spirit
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs