Advertisement
Google Ads BL

అక్కడ మోక్షజ్ఞ కూడా ఉంటే..


ఈరోజు బుధవారం నందమూరి బాలకృష్ణ-బోయపాటి కాంబోలో మొదలైన అఖండ సీక్వెల్ అఖండ తాండవం మూవీ పూజా కార్యక్రమాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అఖండ తాండవం మూవీ ఓపెనింగ్ లో సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా నిలవాల్సింది బాలయ్య. కానీ అక్కడ అందరికన్నా ఎక్కువ హైలెట్ అయ్యింది ఆయన కుమార్తెలు నారా బ్రాహ్మణి, తేజశ్వినిలు.

Advertisement
CJ Advs

తేజశ్వని సమర్పకురాలిగా, బ్రాహ్మణి తండ్రి సినిమాకి క్లాప్ కొట్టారు. బాలయ్య కుమార్తెలు ఎంత పద్దతిగా సంప్రదాయంగా ఉంటారో అందరికి తెలుసు. ఇప్పుడు తండ్రి మూవీ ఓపెనింగ్ లో కుమార్తెలిద్దరూ ఎంతగా హైలెట్ అయ్యారో సోషల్ మీడియా ఓపెన్ చెయ్యగానే అఖండ 2 మూవీ ఓపెనింగ్ వీడియోస్ చూస్తే అర్ధమైపోతుంది. తేజస్విని, బ్రాహ్మణి ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటున్న వీడియోస్, ఫొటోస్, బాలయ్యతో కుమార్తెల ఇద్దరి ఫొటోస్ చూస్తే అభిమానులకి ఒక కోరిక పుట్టింది. 

అదే అక్కడ బాలయ్య వారసుడు మోక్షజ్ఞ కూడా ఉంటే ఎంత బావుంటుందో అని. అసలే ఈ ఏడాదే మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఖరారైంది. మోక్షజ్ఞ న్యూ మేకోవర్ చూసి నందమూరి అభిమానులు మైమరచిపోయారు. అలాంటి సమయంలో బాలయ్య మూవీ ఓపెనింగ్ లో అక్కలతో పాటుగా మోక్షజ్ఞ కూడా ఉంటే అది అభిమానుల ఆనందానికి అవధులు ఉండేవి కావు.. అది నిజమే కదా.! 

Brahmani, Tejaswini at Akhanda Thaandavam movie opening:

Akhanda Thandavam movie opening highlights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs