Advertisement

చంద్రబాబు ఈడీ విచారణ ఎదుర్కోక తప్పదా..?


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈడీ విచారణ ఎదుర్కోవల్సిందేనా..? త్వరలోనే ఏపీ రాజకీయాల్లో ఈ కీలక పరిణామం ఉంటుందా..? అంటే తాజా పరిస్థితిని బట్టి చూస్తే ఇదే అక్షరాలా నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే.. నాడు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ కేసులోనే చంద్రబాబు అరెస్టయ్యి .. ప్రధాన ముద్దాయిగా 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఐతే.. ఈ కేసులో తాజాగా ఈడీ దూకుడు పెంచింది. రూ. 23 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. ఢిల్లీ, ముంబై, పుణేలోని సీమెన్స్‌ కంపెనీ ఆస్తులను అధికారులు అటాచ్‌ చేశారు. ఏపీ సీఐడీ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు వేగవంతం చేయడం జరిగింది.

Advertisement

కీలక మలుపు.. 

అప్పుడెప్పుడో హడావుడి జరిగిన ఈ కేసులో తాజాగా కీలక మలుపు తిరగడంతో టీడీపీ కూటమి సర్కారులో ఒకింత ఆందోళన మొదలైందని తెలుస్తోంది. గత వైఎస్ జగన్ ప్రభుత్వం.. చంద్రబాబు హయాంలో జరిగిన ఈ స్కిల్ స్కాంలోనే ప్రభుత్వం డబ్బులు దుర్వినియోగం జరిగాయని విచారణ చేయడం, కేసు రిజిస్టర్ కూడా చేసింది. ఇందులో నాటి టీడీపీ అధినేత, నేటి సీఎం చంద్రబాబు ప్రధాన ముద్దాయిగా ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ కావడం ఆ తరవాత జరిగిన పరిణామాలు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఐతే.. ఈ కేసులో ఎప్పటికైనా చంద్రబాబు విచారణ ఎదుర్కోవల్సిందే అంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.

ఇప్పుడే ఎందుకు..?

 ఎన్డీఏకు ఊపిరిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు, నితీశ్ కుమార్ ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని విషయాల్లో కేంద్రంలోని మోదీ సర్కార్.. చంద్రబాబు మధ్య తేడా కొట్టినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్, అమరావతికి నిధులు, పోలవరం నిర్మాణం కోసం కేంద్రం ఇవ్వాల్సిన నిధుల విషయంలో, ఆర్బీఐ నుంచి అప్పులు ఇలా కొన్ని విషయాల్లో బేధాభిప్రాయాలు వచ్చయన్నది జగమెరిగిన సత్యమే. దీనికి తోడు.. ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి ఇండియా కూటమికి చంద్రబాబు, నితీశ్ మద్దతు ఇస్తారని.. ఇదే జరిగితే మోదీ ప్రధాని సీటు దిగాల్సిందే అని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు జుట్టు తన చేతిలో పెట్టుకోవాలని మోదీ భావించారట. అందుకే బాబుపై ఈడీ ప్రయోగం చేస్తున్నారని తెలుస్తోంది. ఉన్నట్టుండి ఈడీ దూకుడు పెంచడం, ఆస్తులు అటాచ్ చేయడం కూడా ఇందులో భాగమే అని సమాచారం. ఈ స్కాంలో చంద్రబాబు నిందితులను కాపాడుతున్నారనే ఆరోపణలు  వెల్లువెత్తిన విషయం విధితమే. ఐతే.. బాబు ఇలా చేస్తుండటంతో కేంద్రం దూకుడు పెంచిందనే ఆరోపణలు వస్తున్నాయి. అంటే.. మోదీ చేతిలో చంద్రబాబు జుట్టు ఉందని విమర్శకులు, వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. 

పెద్ద పెద్దోల్లే..!

మోదీ ప్రధానిగా ఉన్న రెండు పర్యాయాలు, ఇప్పుడు కూడా ఎంతో మంది మంత్రులు, ముఖ్యమంత్రులు.. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ విచారణ ఎదుర్కోవడం.. జైలుపాలు అవ్వడం టీవీలు, పేపర్లలో చూసే ఉంటాం. భూ కుంభకోణం కేసులో ఈడీ సుదీర్ఘ విచారణ తర్వాత ఝార్ఖండ్‌ సీఎం, ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హేమంత్‌ సోరెన్‌ను అరెస్ట్ చేసి జైలుపాలు చేసింది కేంద్రమే అని ఆరోపణలు ఉన్నాయి. ఇక ఎలాగో ఢిల్లీ సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ కావడం, బయటికి వచ్చి సీఎం పదవికి రాజీనామా చేయడం ఈ పరిణామాలు అన్నీ అందరికీ తెలిసిందే. ఇక కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ఇలాగే విచారణ ఎదుర్కొని జైలుపాలై బయటికి వచ్చిన వారే. అదే రాష్ట్రానికి చెందిన బిగ్ బుల్, సీనియర్ నేత గాలి జనార్ధన్ రెడ్డి విషయంలో ఏం జరిగిందో గుర్తుండే ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ఘటన జరిగింది. ఇలానే రేపు పొద్దున్న చంద్రబాబు విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందన్నదే తాజాగా నడుస్తున్న చర్చ. మున్ముందు ఏం జరుగుతుందో.. చంద్రబాబు ఏం చేయబోతున్నారో.. మోదీ ఎక్కడి దాకా తీసుకెళ్తారో చూడాలి మరి.

Chandrababu must face ED investigation..?:

ED has increased aggression in the case of skill development scam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement