Advertisement
Google Ads BL

కేటీఆర్ పై ఇంత నెగిటివిటినా..


తెలంగాణ మాజీ మినిస్టర్ కేటీఆర్ పై విద్యార్థుల్లో ఉన్న నెగిటివిటి చూసి కేటీఆర్ మాత్రమే కాదు బీఆరెస్ నేతలంతా షాకవడం ఖాయం. పదేళ్లుగా ఎదురు లేని కేసీఆర్ ఫ్యామిలీకి ఈ ఎన్నికలు బిగ్ షాక్ నిచ్చాయి. ఓటమి చూపించి ఇంటికి పరిమితం చేసినా కేటీఆర్ పై చాలామంది లో తీవ్ర వ్యతిరేఖత ఉంది అనడానికి నిదర్శనం రీసెంట్ గా జరిగిన సంఘటనే పెద్ద ఉదాహరణ. 

Advertisement
CJ Advs

శ‌నివారం మృతి చెందిన ఢిల్లీ విశ్వ విద్యాల‌యం మాజీ ప్రొఫెస‌ర్ సాయిబాబా భౌతిక కాయాన్ని అభిమానులు, ఆయ‌న పూర్వ విద్యార్థుల సంద‌ర్శ‌న కోసం హైద‌రాబాద్‌లోని మౌలాలీలో ఉన్న ఆయ‌న నివాసంలో ఉంచారు. ప్రొఫెసర్ సాయిబాబా భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు కొంతమంది బీఆరెస్ నేతలతో కలిసి కేటీఆర్ ఆయ‌న నివాసానికి చేరుకున్నారు. 

ప్రొఫెసర్ కి కడసారి వీడ్కోలు పలికేందుకు తరలి వచ్చిన విద్యార్థులు అక్కడికొచ్చిన కేటీఆర్‌ను చూసి ఆగ్ర‌హం వ్య‌క్తం చెయ్యడమే కాదు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని కేటీఆర్ కి స్టూడెంట్స్ ముక్తకంఠంతో హెచ్చరించారు. కేటీఆర్ గో బ్యాక్ అంటూ విద్యార్థులంతా కేటీఆర్ కు షాకిస్తూ నినాదాలు చేస్తూ హంగామా చేసారు. 

అది చూసిన బీఆరెస్ నేతలంతా షాకవడమే కాదు కేటీఆర్ గబగబా తెచ్చిన పూల దండలు సాయిబాబా భౌతికకాయానికి వేసి నివాళులు అర్పించి వెంటనే అక్కడి నుంచి వెనుదిరగడం చూసిన వారంతా కేటీఆర్ పై విద్యార్థుల్లో ఇంత నెగిటివిటి ఉందా అంటూ మాట్లాడుకుంటున్నారు. 

So much negativity on KTR..:

KTR Go Back Slogans At GN Saibaba House
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs