పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేసుకుంటూ డిప్యూటీ సీఎం గా అధికారం చేపట్టాక చాలా బిజీ అయ్యారు. సినిమా షూటింగ్స్ కూడా పక్కనపెట్టేసి ఆయన ఏపీ ప్రజల కోసం పాటు పడుతున్నారు. ఇక కొద్దిగా పాలన గాడిలో పడ్డాక పవన్ కళ్యాణ్ తిరిగి సినిమా సెట్స్ లోకి వెళ్లారు. గత నెల 22 నుంచి పవన్ హరి హర వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటూ ఇటు ఏపీ ప్రభుత్వంలో తన వంతు బాధ్యత పూర్తి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ సెట్స్ లోకి రాగానే వీరమల్లు మేకర్స్ కాన్ఫిడెన్స్ తో హరి హర వీరమల్లు రిలీజ్ డేట్ లాక్ చేసేసారు. మార్చ్ 28 న వీరమల్లు విడుదల అంటూ ప్రకటించెయ్యడంతో పవన్ ఇకపై క్రమం తప్పకుండా షూటింగ్ లో పాల్గొంటారు అనుకున్నారు. మళ్ళీ ఈమధ్యన పవన్ కాస్త అనారోగ్యం బారిన పడడం, అలాగే మళ్ళీ ప్రజల కోసం సేవ అంటూ బిజీ అవుతున్నాడు.
దానితో హరి హర వీరమల్లును పవన్ ఎప్పుడు ఫినిష్ చేస్తారో అనే అనుమానం మొదలయ్యింది. తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ నవంబర్ 8 కల్లా హరిహర వీరమల్లు షూటింగ్ ఫినిష్ చెయ్యాలనే టార్గెట్ తో పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత వీరమల్లు మేకర్స్ మిగతా షూటింగ్ అలాగే సిజి వర్క్ తో పాటుగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను చక్కబెట్టుకుని విడుదలకు సిద్దమవుతారట.