Advertisement
Google Ads BL

బిగ్ బాస్ హోస్ట్ గా తప్పుకున్న హీరో


తెలుగులో ఎనిమిదో సీజన్ నడుస్తున్న బిగ్ బాస్ కన్నడ లో మాత్రం ఇప్పటికే పది సీజన్స్ పూర్తి చేసుకుని పదకొండో సీజన్ మొదలు పెట్టుకుంది. కన్నడలో బిగ్ బాస్ కి మొదటి నుంచి హీరో సుదీప్ హోస్ట్ గా చేస్తూ వస్తున్నారు. కన్నడ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ తో షో ని నడిపిస్తున్న సుదీప్ తాజాగా బిగ్ బాస్ ఆడియన్స్ కు షాకిచ్చారు. 

Advertisement
CJ Advs

ఇకపై తాను బిగ్ బాస్ హోస్ట్ గా చెయ్యలేమని ప్రకటించారు. ఈ సీజన్ ని పూర్తి చేసేసి తర్వాత సీజన్ ను ఇకపై హోస్ట్ చెయ్యలేను అని, తనకి కొన్ని పనులు పూర్తి చెయ్యాల్సిన బాధ్యత ఉంది.. అంటూ ప్రకటించారు. అసలు ఈ సీజన్ నే సుదీప్ మానెయ్యాలనుకున్నా బిగ్ బాస్ నిర్వాహకులు ఇంటికి వెళ్ళి సుదీప్ ని బ్రతిమాలి వెనక్కి తెచ్చుకున్నారు. 

రీసెంట్ గానే మొదలైన సీజన్ 11 తర్వాత ఇకపై తాను బిగ్ బాస్ కి హోస్ట్ గా చెయ్యలేను అంటూ సోషల్ మీడియాలొ సుదీప్ వేసిన ట్వీట్ చూసి బుల్లితెర ప్రేక్షకులు బిగా డిజప్పాయింట్ అవుతున్నారు. బిగ్ బాస్ ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్. నాపై మీకున్న ప్రేమ ఎలా ఉందో ఈ బిగ్ బాస్ కి వస్తున్న రేటింగ్ చూస్తే తెలుస్తుంది. కానీ నాకు పూర్తిచెయ్యాల్సిన బాధ్యత ఉంది. 

దానికి సమయం చాలడం లేదు. అందుకే బిగ్ బాస్ హోస్ట్ గా తప్పుకుంటున్నాను.. అంటూ బిగ్ బాస్ ప్రేక్షకులకు సుదీప్ షాకిచ్చారు. 

Kiccha Sudeep shocked bigg boss audience:

Kiccha Sudeep gave a big shock to Bigg Boss viewers
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs