Advertisement
Google Ads BL

రకుల్‌‌ని తీసేసిన ప్రభాస్, కాజల్‌ చిత్రమిదే!


కెరీర్‌లో ఎన్ని అవమానాలను ఎదుర్కొన్నానని అన్నారు బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం పెళ్లి చేసుకుని, సినిమాలకు, టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న రకుల్ ప్రీత్ సింగ్ తన తాజా ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చింది. టాలీవుడ్‌కు దూరంగా ఉండటం కాదు.. ప్రస్తుతం ఆమెకు టాలీవుడ్‌లో అవకాశాలు లేవు. అందుకే ఇతర వుడ్స్‌లో ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఆమె ఈ ఇంటర్వ్యూలో చెప్పిన ఆసక్తికర విషయం ఏమిటంటే.. ప్రభాస్ సినిమాలో తనని తీసేసి.. కాజల్‌ని పెట్టుకున్నారట. అసలు మ్యాటర్ ఏంటంటే..

Advertisement
CJ Advs

ప్రభాస్‌తో ఓ సినిమాకు నన్ను ఫైనల్ చేసి ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేశారు. అప్పుడు నేను చదువుకుంటున్నాను. షెడ్యూల్ పూర్తయిన తర్వాత చదువు నిమిత్తం నేను ఢిల్లీ వెళ్లాను. ఆ తర్వాత షెడ్యూల్‌కు నాకు కాల్ రాలేదు. ఆ తర్వాత అడిగితే.. వేరే హీరోయిన్‌ని తీసుకున్నారని తెలిసింది. చాలా ఫీలయ్యాను. అయితే నాకు అసలు చెప్పకుండా, వేరే హీరోయిన్‌ని తీసుకోవడం ఏమిటో నాకు అర్థం కాలేదు. ఆ హీరోయిన్ ఎవరో కాదు. కాజల్ అగర్వాల్. ప్రభాస్, కాజల్ కాంబినేషన్‌లో అంతకు ముందు వచ్చిన చిత్రం మంచి హిట్ అయిందట. అందుకని నేను చేయాల్సిన పాత్ర నుండి నన్ను తొలగించి కాజల్‌కు ఆ అవకాశం ఇచ్చారు. ఇలాంటి అవమానాలు కెరీర్ స్టార్టింగ్‌లో చాలానే చూశానంటూ రకుల్ చెప్పుకొచ్చింది. 

రకుల్ ఇచ్చిన ఈ సమాచారంతో ప్రభాస్, కాజల్‌ల ఆ సినిమా ఏమై ఉంటుందా? అని అంతా సెర్చ్ చేస్తున్నారు. ఆ సినిమా మరేదో కాదు.. మిస్టర్ పర్ఫెక్ట్. అంతకు ముందు ప్రభాస్, కాజల్ కాంబోలో వచ్చిన చిత్రం డార్లింగ్. ఆ సినిమా మంచి విజయం సాధించడమే కాకుండా.. ప్రభాస్‌కు డార్లింగ్ అనే గుర్తింపుని స్థిరం చేసింది. డార్లింగ్ తర్వాత ఈ కాంబోలో వచ్చిన చిత్రం మిస్టర్ పర్ఫెక్ట్. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. నిజంగా ఈ సినిమాలో కాజల్ చాలా చక్కగా సరిపోయింది. ఆ పాత్రలో ఇప్పుడు చెబుతున్న రకుల్‌ని ఊహించుకుంటే.. ఏమంత గొప్పగా ఉండేది కాదు. కాబట్టి మేకర్స్ ఛాయిస్ కరెక్ట్ అనే చెప్పుకోవాలి. కాకపోతే.. రకుల్‌కి ఓ మాట చెప్పి ఉంటే బాగుండేది.

Kajal Replaced Rakul Preet Singh For Prabhas Mr Perfect :

Rakul Unhappy with Prabhas Mr Perfect Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs