Advertisement
Google Ads BL

రూ. 500 ప్లస్ కోట్లు.. నిజమేనా దేవర!


మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. ఇప్పటి వరకు తన కెరీర్‌లో లేని ఫిగర్స్‌ని దేవర చిత్రం ఆయనకు పరిచయం చేసింది. అవును.. దేవర చిత్రం రూ. 500 కోట్ల ప్లస్ కలెక్షన్స్‌ని రాబట్టినట్లుగా మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 509 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లుగా తెలిపారు. అయితే ఈ కలెక్షన్స్ నిజమేనా? లేదంటే ఫ్యాన్స్ కోసం ఏదో ఒక పోస్టర్ అలా వదిలారా? అనేది మేకర్స్‌కే తెలియాలి. 

Advertisement
CJ Advs

ఎందుకంటే.. రీసెంట్‌గా లక్కీ భాస్కర్ మూవీ మీడియా సమావేశంలో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవర సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన ఆయన.. ఫ్యాన్స్ కోసం అలా పోస్టర్స్ విడుదల చేస్తుంటామని.. గ్రాస్ ఏదో, షేర్ ఏదో టాక్స్ వాళ్లకి తెలుసు అన్నట్లుగా చెప్పుకొచ్చారు. మరి ఆయన మాటల ప్రకారం దేవర కలెక్షన్స్ ఒరిజినలా? లేదంటే ఫేకా అనేది క్లారిటీ లేకుండా పోయింది. 

అయితేనేం.. ఫ్యాన్స్ మాత్రం ఈ ఫిగర్స్‌తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. ఇది కొట్టండిరా.. అంటూ ఇతర హీరోల ఫ్యాన్స్‌ని రెచ్చగొడుతున్నారు. మరీ ముఖ్యంగా గేమ్ చేంజర్ సినిమాకు సవాళ్లు విసురుతున్నారు. మొత్తంగా అయితే దేవర కలెక్షన్ల పోస్టర్స్‌తో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. 

NTR Devara Part 1 Crosses Rs 500 Crore Mark:

<span>NTR Devara Part 1 grossing Rs 509 crore in just 16 days</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs