Advertisement
Google Ads BL

విశ్వంభరకు ఒక్క సాంగే బ్యాలెన్స్


మెగాస్టార్ చిరంజీవి హీరోగా, డెబ్యు మూవీ బింబిసారతో బ్లాక్ బస్టర్ దర్శకుడిగా పేరొందిన వశిష్ట దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్ విశ్వంభర. UV క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. రాబోయే సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా అనూహ్యంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక విజయదశమిని పురస్కరించుకుని మేకర్స్ ఇచ్చిన టీజర్ ట్విస్ట్.. ఫ్యాన్స్‌కి మరో పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. టీజర్‌తో అంతా హ్యాపీనే కానీ.. ఈ సినిమా విడుదల ఎప్పుడు అంటూ అంతా చిత్రయూనిట్‌ని ప్రశ్నిస్తున్నారు. 

Advertisement
CJ Advs

అయితే ఈ సినిమా వాయిదా పడటానికి కారణం గేమ్ చేంజర్ చిత్రమే అని దర్శకుడు వశిష్ఠ, సమర్పకుడు విక్రమ్ రెడ్డి.. టీజర్ లాంచ్ వేడుకలో తెలియజేశారు. విశ్వంభర వాయిదాకు కారణం విఎఫ్‌ఎక్స్ వర్క్ పెండింగ్‌లో ఉండటమే అనేలా వార్తలు వస్తున్న తరుణంలో.. అలాంటిదేమీ లేదని వారు క్లారిటీ ఇచ్చారు.

టీజర్ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఒక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ వుంది. అది త్వరలోనే షూట్ చేస్తాం. చాలా బిగ్ స్కేల్ ఉన్న సినిమా ఇది. ప్రీ ప్రొడక్షన్ చాలా సమయం తీసుకొని చేశాం. మెగాస్టార్‌తో వర్క్ చేయడం చాలా ఎక్సైటింగ్ ఫీలింగ్. ఒక అభిమానిగా ఆ ఫీలింగ్‌‌తోనే వర్క్ చేశాను. విశ్వంభర ప్రేక్షకులు, అభిమానులు అంచనాలను మించేలా ఉంటుందని దర్శకుడు వశిష్ట వెల్లడించగా.. విశ్వంభర ఎప్పుడు వస్తే అప్పుడే పండగ. రామ్ చరణ్ కోసం దిల్ రాజుగారు అడగడంతో విశ్వంభర విడుదల వాయిదా వేశాం. సినిమా షూటింగ్‌ కూడా అనుకున్న ప్రకారమే పూర్తయిందని పేర్కొన్నారు సమర్పకుడు విక్రమ్ రెడ్డి.

Only One Song Balance To Vishwambhara:

Megastar Chiranjeevi Vishwambhara Latest Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs