మనషులే కాదు, థియేటర్లు కూడా ఓల్డ్ అయిపోతాయి. మూతపడతాయి. మనుషులు భూమి లేకుండా పోయినట్లే.. సినిమా థియేటర్లు కూడా ఓల్డ్‌వి కనుమరుగవుతున్నాయి. మరణం మళ్లీ జననానికే అన్నట్లుగా.. మూత పడిన థియేటర్ల స్థానంలో ఇప్పుడు మల్టీప్లెక్స్‌లు దర్శనమిస్తున్నాయి. ఇక విషయంలోకి వస్తే.. ఆ థియేటర్ కాంప్లెక్స్ తమిళనాడులో చాలా చాలా ఫేమస్. కానీ ఇప్పడది శాశ్వతంగా మూత పడబోతోంది.
చెన్నైలో ఉన్న పాత, ఫేమస్ థియేటర్లలో ఉదయం సినిమాస్ ఒకటి. ఇప్పుడీ ఉదయం థియేటర్ శాశ్వతంగా కనుమరుగు కాబోతోంది. 1983లో ప్రారంభమైన ఈ థియేటర్ కాంప్లెక్స్‌లో ఉదయం, సూరియన్, చందిరన్ అనే పేర్లతో మూడు స్క్రీన్లు ఉన్నాయి. దాదాపు 41 ఏళ్లుగా ప్రేక్షకులని అలరించి, ప్రతి ప్రేక్షకుడితో ఎంతో కనెక్షన్ పొందిన ఈ కాంప్లెక్స్.. ఇకపై కనిపించకుండా పోతుందంటే చింతించాల్సిన విషయమే.
కారణం ఏంటనేది పక్కన పెడితే.. ఈ కాంప్లెక్స్‌తో కనెక్షన్ ఉన్నవారు బాధపడక తప్పదు. వాస్తవానికి ఎప్పుడో ఈ కాంప్లెక్స్‌ని కూల్చేసి లగ్జరీ అపార్ట్‌మెంట్ కట్టబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ క్రయ విక్రయాలలో జాప్యం కారణంగా ఇప్పుడీ కాంప్లెక్స్‌లో రజినీకాంత్ వేట్టయన్ సినిమా ప్రదర్శించబడుతోంది. ఈ సినిమా రన్ అయిన రోజులు ఆడించి ఆ తర్వాత కూల్చేస్తారనేలా వార్తలు వినిపిస్తున్నాయి. మరో విషయం ఏమిటంటే.. ఈ థియేటర్లలో మొదట ప్రదర్శించిన చిత్రం రజినీకాంత్ నటించినదే కావడం. శివప్పు సూరియన్ సినిమాతో మొదలైన ఉదయం ప్రస్థానం వేట్టయన్‌తో ముగుస్తోంది.