Advertisement
Google Ads BL

చరిత్ర.. బాలయ్య నోట మళ్లీ అదే డైలాగ్


చరిత్ర సృష్టించాలన్నా మేమే.. మళ్లీ దానిని తిరగరాయాలన్నా మేమే.. అంటూ మళ్లీ బాలయ్య నోట డైలాగ్ వచ్చింది. విజయదశమి రోజున ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4 ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆహాలో ఈ షో ఎలాంటి సక్సెస్‌ను సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆయనేదో చరిత్ర తిరగరాసినట్లుగా బాలయ్య ఈ స్టేజ్‌పై చెప్పడం.. చూస్తున్న వారికి కూడా కాస్త ఇబ్బందికరంగా అనిపించింది. అలాగే ఆహా కూడా ఈ కార్యక్రమానికి సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండానే.. హడావుడిగా ఈ ట్రైలర్ లాంచ్‌ని ముగించేశారు. 

Advertisement
CJ Advs

చరిత్రలు, చెత్తబుట్టల గురించి మాట్లాడుకునే టైమ్ కాదిది అని బాలయ్య ఇకనైనా గమనించాలి అంటూ బాలయ్య అభిమానులే ఆయన డైలాగ్‌పై సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తుండటం విశేషం. తండ్రి సృష్టించిన చరిత్రని నాది అని చెప్పుకోవడం ఏంటి? అంటూ యాంటీ ఫ్యాన్స్ కూడా గరం గరం అవుతున్నాయి. అయినా, బాలయ్య ఏదీ ఆలోచించడు.. ఆ నిమిషం ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తాడనే విషయం తెలియంది కాదు. అందుకే అందరూ ఆయనని భోళా మనిషి అని అంటుంటారు.

అదలా ఉంటే.. అన్‌స్టాపబుల్ షో చేయడానికి కారణం కేవలం అల్లు అరవిందే అని బాలయ్య ఈ కార్యక్రమంలో మరోసారి చెప్పుకొచ్చారు. అంతకు ముందు చాలా మంది చాలా షోలకు అడిగినా నో చెప్పాను. ఈ షోకి కూడా వేరే వాళ్లు ఎవరు అడిగినా సరే.. కచ్చితంగా నో చెప్పేవాడిని. అరవింద్‌‌గారు అడగగానే కాదనలేకపోయా అని చెప్పుకొచ్చారు. గత సీజన్ల కంటే ఈ సీజన్‌-4 పండగలా ఉంటుందని.. దెబ్బకి థింకింగ్ మారితీరాలా అంటూ బాలయ్య ఈ సీజన్‌పై హైప్ పెంచేశారు.

Nandamuri Balakrishna Words at Unstoppable 4 Trailer Launch:

Balakrishna about Unstoppable Season 4
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs