Advertisement
Google Ads BL

NBK109 టైటిల్ రివీలయ్యేది ఎప్పుడంటే


నందమూరి నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రానికి ఏం టైటిల్ ఫిక్స్ చేస్తారా? అని నందమూరి అభిమానులు ఎప్పటి నుండో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మేకర్స్ పోస్టర్స్, గ్లింప్స్ వంటివి వదులుతున్నారు కానీ.. టైటిల్ విషయంలో మాత్రం ఊరిస్తూనే వస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ కోసం వేచి చూస్తున్న వారందరికీ విజయదశమి కానుకగా ఓ గుడ్ న్యూస్ వచ్చేసింది. NBK109 టైటిల్‌ని ఎప్పుడు రివీల్ చేసేది మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Advertisement
CJ Advs

NBK109 టైటిల్ టీజర్‌ను దీపావళి రోజున విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ ఈ విజయదశమికి మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్‌లో గుర్రంపై స్వారీ చేస్తున్న నందమూరి బాలకృష్ణ లుక్ రాజసం ఉట్టిపడేలా ఉంది. ఈ చిత్రంలో గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్యని దర్శకుడు బాబీ, వయొలెంట్ పాత్రలో స్టైలిష్‌గా చూపించబోతున్నారనేది తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నందమూరి అభిమానులు ఈ పోస్టర్‌ని వైరల్ చేస్తున్నారు.

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2025 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఓ కీలక పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

NBK109 Super Massy Title Teaser For Diwali:

God of Masses Nandamuri Balakrishna Starring NBK109 Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs