కొన్ని కాంబినేషన్లకు ఓ బ్రాండ్ ఉంటుంది. అలాంటి బ్రాండ్‌నే గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య, బోయపాటి క్రియేట్ చేశారు. వారిద్దరి కాంబినేషన్‌లో మూవీ అంటే.. బ్లాక్‌బస్టర్ అని పక్కాగా రాసి పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే, వీరి కాంబినేషన్‌లో ఇంతకు ముందు వచ్చిన హ్యాట్రిక్ చిత్రాలు ఒకదానిని మించి ఒకటి సక్సెస్ అయ్యాయి. సింహ, లెజెండ్, అఖండ వంటి బ్లాక్‌బస్టర్ సక్సెస్ తర్వాత మరో హ్యాట్రిక్‌కు ఈ కాంబో శ్రీకారం చుట్టబోతోంది. ఆ శ్రీకారానికి నాంది ఈ విజయదశమిగా మారింది. అవును.. బాలయ్య, బోయపాటి కాంబో మూవీ BB4 అప్డేట్ వచ్చేసింది. అది అలాంటిలాంటి అప్డేట్ కాదు.. బ్లాస్టింగ్ అప్డేట్.
ఈ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న BB4 చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మిస్తుండగా.. బాలయ్య బేటీ ఎమ్ తేజస్విని నందమూరి సమర్పించనుంది. అక్టోబర్ 16న ఉదయం 10 గంటలకు ఈ సినిమాను గ్రాండ్‌గా ప్రారంభించబోతున్నట్లుగా అధికారికంగా మేకర్స్ తెలియజేశారు. ఇటీవల బాలయ్య పుట్టినరోజున ఈ ప్రాజెక్ట్‌ని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. లెజెండ్ చిత్ర నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో, ఇప్పటి వరకు బాలయ్య కెరీర్‌లోనే లేనంత భారీ బడ్జెట్‌తో ఈ నిర్మించబోతున్నారని తెలుస్తోంది.
విజయదశమి సందర్భంగా చిత్ర ప్రారంభ వివరాలు తెలిపిన మేకర్స్.. ఓపెనింగ్ రోజు ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను తెలియజేస్తామని వెల్లడించారు. అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పనిచేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ వివరాలు తెలియాలంటే అక్టోబర్ 16 వరకు వేచి చూడాల్సిందే.