రాశి ఖన్నా ఏ డ్రెస్ వేసినా అందానికి అందం, గ్లామర్ కి గ్లామర్ కనిపిస్తుంది. సౌత్ లో పెద్ద పెద్ద ఛాన్సెస్ రాకపోయినా హిందీలో మాత్రం మెల్లగా పాగా వేసేందుకు వేచి చూస్తుంది. ఈమధ్యన ఎక్కువగా గ్లామర్ షో మీద కాన్సంట్రేషన్ చేసిన రాశి ఖన్నా తాజాగా ట్రెడిషనల్ అనాలో.. ఫెస్టివ్ లుక్ అనాలో మరి.
రాశి ఖన్నా చక్కటి సాంప్రదాయ లుక్ లో దర్శనమిచ్చింది. అది చూసిన ఆమె అభిమానులు దసరా సమయంలో రాశి ఖన్నా సొగసులు అంటూ మాట్లాడుతున్నారు. దాండియా నైట్ కోసం చక్కగా రెడీ అయిన రాశి ఖన్నా ఫోటోలకు ఫోజులిచ్చింది. మరి దసరా సెకెబ్రేషన్స్ లో రాశి ఖన్నా ఇలా క్యూట్ అండ్ బ్యూటిఫుల్ గా తయారై అదరగొట్టేసింది.