మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర చిత్రం సక్సెస్ తో ఎంజాయ్ చెయ్యకపోయినా రిలాక్స్ అవుతున్నారు. దేవర చిత్రానికి మొదటిరోజు వచ్చిన నెగిటివిటీతో దేవర చిత్రం విజయతీరానికి చేరుతుంది అని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. నెగెటివ్ టాక్ తోనే 500 కోట్లకు పైగా పాన్ ఇండియా మార్కెట్ లో కలెక్షన్స్ రాబట్టిన దేవర చిత్రం విజయం తర్వాత ఎన్టీఆర్ చాలా ఎమోషనల్ అయ్యారు.
అభిమానులు తనని కాపాడారంటూ ఎన్టీఆర్ ఓపెన్ గానే మాట్లాడారు. ఇక దేవర విడుదలై 15 రోజులైంది. ప్రస్తుతం ఎన్టీఆర్ రిలాక్స్ మోడ్ లో ఉన్నారు. అతి త్వరలోనే ఆయన వార్ 2 సెట్స్ లోకి వెళ్ళబోతున్నారు. ముంబై లో జరిగే వార్ 2 క్లైమాక్స్ లో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. అయన్ ముఖర్జీ దర్శకత్వంలో ప్రెస్టీజియస్ స్పై యూనివర్స్ సీక్వెల్ మూవీ వార్-2 తెరకెక్కుతుంది.
హ్రితిక్ రోషన్ హీరోగా ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించబోతున్న ఈ చిత్రం షూటింగ్ లో ఆల్రెడీ ఎన్టీఆర్ మే నెలలోనే పాల్గొన్నారు. ఆతర్వాత ఆగష్టు లో వార్ 2 సెట్స్ లోకి వెళ్లిన ఎన్టీఆర్ మధ్యలో దేవర ప్రమోషన్స్ కి సమయం తీసుకున్నారు. ప్రస్తుతం వార్ 2 నెక్స్ట్ షెడ్యూల్‌కి రెడీ అవుతోంది. దానికి సంబందించిన క్లైమాక్స్ సీక్వెన్స్‌ని ఈ షెడ్యూల్‌లో షూట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఎన్టీఆర్-హృతిక్‌ల మధ్య జరిగే ఈ క్లైమాక్స్ సినిమాలో నెక్స్ట్ లెవెల్‌లో ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. నవంబర్‌లో ఈ క్లైమాక్స్ షూట్ చేయనున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.