దేవర విడుదలకు ముందు మెగా ఫ్యాన్స్ ముసుగులో కొంతమంది ఎన్టీఆర్ ని దేవర చిత్రాన్ని తొక్కేయ్యాల్ని చాలా చూసారు. కొరటాల శివ ఆచార్య డిసాస్టర్ ను మెగా హీరోలకు కట్టబెట్టి ఎన్టీఆర్ కి దేవర తో హిట్ ఇస్తావా అంటూ దేవర విడుదలకు ముందు నుంచి, విడుదలైన రోజు దేవర చిత్రం పై, దర్శకుడు కొరటాల పై చూపించిన నెగిటివిటి అంతా ఇంతా కాదు.
అయితే నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర ను గట్టెక్కించారు. అందులో మహేష్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా దేవరను డైరెక్ట్ గా సపోర్ట్ చేసారు. మెగా అభిమానుల్లో మాత్రం ఎంతోకొంత ఈర్ష్య ఉంది అనేది వాస్తవం. అయితే తాజాగా మెగా ఫ్యాన్ ఒకరు సోషల్ మీడియాలో దేవర పై పెట్టిన పోస్ట్, వార్ 2 పోస్టర్ రెండూ విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది.
ఏయ్ తారక్....
ఉత్తరాదిన ఒక మాట బయటకు దిగింది ఈరోజు...!!
అతి త్వరలో యుద్ధ భూమిలోకి పులి దిగుతోంది
దేశపు సినిమాను ఏలుతున్నారు కదయ్యా నువ్వూ నీ దోస్త్ @AlwaysRamCharan ....!!
తెలుగోడి గౌరవాన్ని నిలబెట్టావ్ మరోసారి!
శభాష్ బిడ్డా.. అంటూ పైన వేసిన వార్ 2 పోస్టర్ ను మెగా ఫ్యాన్ షేర్ చేసారు. నిజంగా ఇది చూస్తే దేవర విడుదలకు ముందు వీరేనా అంత నెగిటివిటి చూపించారు. అందులో నిజంగా వాస్తవం ఉందా అనిపించక మానదు.