గేమ్ ఛేంజర్ నుంచి రామ్ చరణ్ రిలాక్స్ అవడమే కాదు ఆయన తన తదుపరి మూవీ RC 16 కోసం ఫుల్ గా మేకోవర్ అవుతున్నారు. ఆస్ట్రేలియా లో రామ్ చరణ్ RC 16 కోసం స్పెషల్ గా మేకోవర్ అయ్యారు. అయితే బుచ్చి బాబు తో చెయ్యబోయే సినిమా కోసం రామ్ చరణ్ ఎలాంటి లుక్ లో కనిపిస్తారనే క్యూరియాసిటితో చాలామంది ఎదురు చూస్తున్నారు.
తాజాగా రామ్ చరణ్ RC 16 లుక్ రివీలైంది. ఈరోజు బుధవారం రామ్ చరణ్ ప్రముఖ దర్శకుడు వి.వి వినాయక్ బర్త్ డే సందర్భంగా ఆయనకు విషెస్ తెలియజేసేందుకు వెళ్ళినప్పుడు రామ్ చరణ్ లుక్ రివీలైంది. చరణ్ మాసివ్ లుక్ ఒక్కసారిగా సోషల్ మీడియా ట్రెండ్ అవుతుంది. రామ్ చరణ్ పెరిగిన గెడ్డంతో హెయిర్ కనిపించకుండా క్యాప్ పెట్టి అదిరిపోయే మెకోవర్లో కనిపించాడు.
అది చూసాక మెగా అభిమానులు చక్కగా రిలాక్స్ అవుతున్నారు. రామ్ చరణ్ లుక్ చూసి గేమ్ ఛేంజర్ బెంగ కూడా తీరిపోయింది అంటున్నారు. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ మెగా ఫ్యాన్స్ సహనానికి పరీక్ష పెడుతున్నారు. మరి ఆ గేమ్ ఛేంజర్ రిలీజ్ ఎప్పుడు ఉంటుందో చూడాలి.. ప్రస్తుతానికైతే మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ.