Advertisement
Google Ads BL

ఆద్య తో కలిసి పవన్ స్పెషల్ పూజలు


ఎలక్షన్స్ సమయంలో పవన్ కళ్యాణ్ తన వారసుడు అకీరా నందన్ ను ఎక్కువగా పబ్లిక్ లోకి ముఖ్యముగా చంద్రబాబు, పీఎం నరేంద్ర మోడీ ముందుకు తీసుకురావడం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను బాగా ఇంప్రెస్స్ చేసింది. ఆ తర్వాత అకీరా పవన్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోను అకీరా హైలెట్ అయ్యాడు. 

Advertisement
CJ Advs

ఆతర్వాత పవన్ కళ్యాణ్ ఎక్కువగా తన కుమార్తె ఆద్యతో కలిసి కనిపిస్తున్నారు. రీసెంట్ గా తిరుమల తిరుపతిలో తన కుమర్తెలు అంజలి-ఆద్యలతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత పవన్ కుమర్తెల విషయంలో మీడియా లో విపరీతమైన చర్చ నడిచింది. తాజాగా పవన్ కళ్యాణ్ మరోసారి తన కుమార్తె ఆద్యతో కలిసి విజయవాడలో కనిపించారు. 

ఈరోజు మూల నక్షత్రం పర్వదినం రోజున ఇంద్రకీలాద్రిపై కొలువైన సరస్వతీ దేవి అలంకారంలో ఉన్న జగన్మాతను తన కుమార్తె ఆద్య తో కలిసి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, కార్యనిర్వహణాధికారి కెఎస్ రామరావులు ఆలయ అధికారులు, వేద పండితులు శాస్త్రోక్తంగా పవన్ కళ్యాణ్ కు మేళ తాళాలతో స్వాగతం పలికారు. కుమార్తె ఆద్యతో కలిసి పవన్ కళ్యాణ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

Pawan with daughter Adya special puja to Kanakadurga:

Pawan Kalyan, along with his daughter Adya, visits Kanaka Durgamma Temple
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs