Advertisement
Google Ads BL

కేకే అయ్యారుగా మరో ఆరా మస్తాన్..!!


అవును.. మీరు వింటున్నది, చూస్తున్నది అక్షరాలా నిజమే. ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి కచ్చితంగా గెలిచి తీరుతుందని.. బల్ల గుద్ది మరీ చెప్పింది కేకే సర్వే. మిగిలిన సర్వేలు ముఖ్యంగా.. ఆరా మస్తాన్ లాంటి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ గెలిచి రెండోసారి అధికారంలోకి వస్తుందని సర్వే చేసి చెప్పారు. ఐతే.. ఆరా సర్వే అట్టర్ ఫ్లాప్ కాగా.. కేకే సర్వే మాత్రం అక్షరాలా సూపర్ హిట్టయ్యింది. దీంతో అసలు అంత కచ్చితంగా కేకే సర్వే సంస్థ ఎలా చెప్పగలిగింది..? అది కూడా 100 కు 100 శాతం నిజం కావడంతో ఇక ఆయనకు ఎదురు లేకుండా పోయిందని యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజలు భావించారు. ఐతే ఈ ఆనందం పట్టుమని 4 నెలలు కూడా లేకుండా పోయింది.

Advertisement
CJ Advs

ఇదీ అసలు కథ..

 హర్యానాలో బీజేపీ, జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలు గెలిచిన సంగతి తెలిసిందే. ఐతే.. ప్రీ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఈ ఫలితాలు రావడంతో సర్వే సంస్థలు, రాజకీయ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇందులో ఒక్కరు కొండేటి కిరణ్ (కేకే). హర్యానాలో 65కు పైగా సీట్లతో కాంగ్రెస్‌ గెలువబోతుందని కేకే సర్వే చెప్పింది. ఇప్పటికే ఏపీలో ఈయన సర్వే అక్షరాలా నిజం కావడంతో.. ఇదే సీన్ అక్కడ కూడా వర్కవుట్ అవుతుందని అందరూ అనుకున్నారు కానీ సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. కాంగ్రెస్ అడ్రెస్స్ లేకుండా పోయింది. దీనికి తోడు.. బీజేపీ కనీస పోటీ ఇవ్వలేదని.. ఆ పార్టీ టైటానిక్‌ షిప్‌లాంటిదని కూడా 

కిరణ్ చెప్పడం గమనార్హం. ప్రతి మూడు నియోజకవర్గాల్లో రెండింట కాషాయ పార్టీ ఓడిపోతుందని జోస్యం చెప్పారు. కానీ.. ఈ స్ట్రాటజీలో ఏ ఒక్కటీ నిజం కాలేదు.

ఒక్కరే కాదు అంతా..!

వాస్తవానికి జమ్మూలో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది గనుక అక్కడ.. హర్యానాలో బీజేపీపై వ్యతిరేకత ఉండటంతో ఇక్కడ కూడా..  అంటే రెండు రాష్ట్రాలు హస్తగతం అవుతాయని చాలా సర్వే సంస్థలు, జాతీయ మీడియా కూడా జోస్యం చెప్పింది. సీన్ కట్ చేస్తే ఆ అంచనాలు అన్నీ తలకిందులు అయ్యాయి. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్‌ కొట్టింది. దీంతో.. హర్యానా ప్రజల తీర్పును కేకే పసిగట్టలేకపోయారని ఇట్టే తేలిపోయింది. దీంతో కేకేపై సోషల్ మీడియా వేదికగా అదేం ఏపీ అనుకున్నారా..? లేదా మరొకటి అనుకున్నారా..? అంటూ నెటిజన్లు ఆడుకుంటున్నారు.

అప్పుడు.. ఇప్పుడు..!

నాలుగు నెలల క్రితం జాతీయ స్థాయిలో ప్రదీప్ గుప్తా, తెలుగు రాష్ట్రాల్లో ఆరా మస్తాన్ చేసిన సర్వేలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. దీంతో ఈ ఇద్దరూ మరెక్కడా సర్వేలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. అంతకు ముందు లగడపాటి రాజగోపాల్ పరిస్థితి కూడా ఇదే. ఐతే.. తాజా కలితలతో కేకే సర్వే అధినేత కిరణ్ కొండేటి కూడా అదే దారిలో పయనించినట్టు అయ్యింది. దీంతో.. సోషల్ మీడియా వేదికగా చిత్ర విచిత్రాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఏపీ ఎన్నికల ఫలితాల వరకు ఎగ్జిట్ పోల్స్ కింగ్ లా ఉన్న ఆరా మస్తాన్ ఒకే ఒక్క దెబ్బకు క్రెడిబులిటీ మొత్తం పోయింది. ఇదే ఏపీ ఎన్నికల సర్వే చేసి కింగ్ అయిన కేకే ఇవాళ  హర్యానా ఫలితాల దెబ్బకి నేలమీదకి వచ్చేశారని కామెంట్స్ చేస్తున్న పరిస్థితి.

నాడి అందట్లేదా..?

గత కొన్ని నెలలుగా దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో  ఎగ్జిట్ పోల్స్ చేస్తున్న సర్వే సంస్థలు ఘోరంగా ఫెయిల్ అవుతున్నాయి. దీంతో అసలు ఎగ్జిట్ పోల్స్ కు ప్రజల నాడి అందట్లేదా..? లేదంటే ఈవీఎం మిషన్ల మాయాజాలాన్ని అంచనా వెయ్యలేకున్నారా..? అనే మాటలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. రానున్న రోజుల్లో ఎగ్జిట్ పోల్స్ అనేవి ప్రజలు, నాయకులు పూర్తిగా నమ్మకుండా పోయే రోజులు ఎంతో దూరంలో లేవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి. అంతేకాదు.. ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ లను ప్రభుత్వం నిషేధించినా పెద్ద ఆశ్చర్యపోనక్కర్లేదు ఏమో..!

KK becoming Another Aara Mastan..!!:

 KK survey fail miserably in the Haryana general elections
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs