నిజమే రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ అంటే ఇప్పుడు అందరికి ఆటలైపోయింది. నిర్మాత దిల్ రాజు ఏ ఈవెంట్ లో కనిపించినా మీడియా పదే పదే గేమ్ ఛేంజర్ రిలీజ్ తేదీపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. మరోపక్క మెగా ఫ్యాన్స్ కి శంకర్ పై మండిపోతుంది. అందుకే సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ రిలీజ్ విషయంలో మినీ యుద్ధమే చేస్తున్నారు.
సుహాస్ నటించిన జనక ఐతే గనక అనే మూవీ ఈవెంట్ లో దిల్ రాజు ని ఆ గేమ్ ఛేంజర్ రిలీజ్ విషయం అడిగితే ఇది జనక ఐతే గనక ఈవెంట్.. సో గేమ్ ఛేంజర్ విషయాలు అడగొద్దని సున్నితంగా చెప్పారు. ఇప్పడు అదే జనక ఐతే గనక ప్రమోషన్స్ కోసం దిల్ రాజు సుహాస్ అండ్ హీరోయిన్ తో కలిసి బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చారు.
అక్కడికి రాగానే హోస్ట్ నాగార్జున దిల్ రాజు గారు ముందు గేమ్ ఛేంజర్ రిలీజ్ ఎప్పుడో చెప్పమని సరదాగా అడిగే సరికి దిల్ రాజు చెబుతామండి.. కాస్త వెయిట్ చెయ్యండి అని తప్పించుకున్నారు. అది చూసిన నెటిజెన్స్ గేమ్ ఛేంజర్ రిలీజ్ తేదీ అంటే అందరికి ఆటలైపోయింది అంటూ కామెడీగా కామెంట్స్ చేస్తున్నారు.